Share News

Accident: ఘోర ప్రమాదం.. వాహనం కాలువలో పడి నలుగురు జవాన్లు మృతి

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:39 PM

ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న వాహనం ఆకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. పెద్ద బండ రాళ్లు వచ్చి పడటంతో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. ఈ విషాద ఘటన సిక్కింలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Accident: ఘోర ప్రమాదం.. వాహనం కాలువలో పడి నలుగురు జవాన్లు మృతి
four jawans died

సిక్కిం(Sikkim)లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీ సిబ్బంది ఉన్న వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు 300 అడుగుల కాలువలో పడిపోయింది. దీంతో నలుగురు సైనికులు మరణించారు. సమాచారం అందుకున్న ఆర్మీ, స్థానిక పరిపాలన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాలువలో పడిన వాహనంలోని సైనికుల మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఆకస్మాత్తుగా పెద్ద రాళ్లు రోడ్డుపై పడటం వల్ల వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.


నలుగురు జవాన్లు

పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్‌ నుంచి సిల్క్‌ రూట్‌ మీదుగా సిక్కింలోని జులుక్‌కు ఇండియన్‌ ఆర్మీ ట్రక్‌ వెళ్తోన్న క్రమంలో ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ట్రక్కు 300 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన నలుగురు జవాన్లు మృత్యువాత పొందారు. ట్రక్కు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సిల్క్ రూట్‌గా ప్రసిద్ధి చెందిన రెనాక్ రోంగ్లీ హైవేకి సమీపంలో ఉన్న దలోప్‌చంద్ దారా సమీపంలోని వర్టికల్ వీర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.


ఎవరు అమరులయ్యారంటే

మరణించిన సైనికుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ ప్రదీప్ పటేల్, మణిపూర్‌కు చెందిన క్రాఫ్ట్‌మ్యాన్ డబ్ల్యు. పీటర్, హర్యానాకు చెందిన నాయక్ గుర్సేవ్ సింగ్, తమిళనాడుకు చెందిన సుబేదార్ కె. తంగపాండి ఉన్నారు. సైనికులందరూ పశ్చిమ బెంగాల్‌లోని బినాగురిలోని ఒక యూనిట్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అమరవీరుల పార్థివ దేహాలను వారి ఇంటికి తరలించేందుకు భారత సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సైనికుల ఇళ్లు, గ్రామాల్లో శోకసంద్రం నెలకొంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Suvendu Adhikari: ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో సీఎం మమత ఫోన్ కాల్స్ తనిఖీ చేయాలి


Delhi High Court: వికీపీడియాను మందలించిన ఢిల్లీ హైకోర్టు.. కారణమిదే..


Bangalore: చార్జ్‌షీట్‌లో.. ఏ2గా స్టార్‌ హీరో దర్శన్


Minister: ఇలాంటి నటులు దేశాన్ని కాపాడగలరా?


Read More National News and Latest Telugu News

Updated Date - Sep 05 , 2024 | 08:41 PM