Modi And Meloni: నరేంద్ర మోదీతో కలిసి నవ్వుతూ సెల్ఫీ దిగిన మహిళా ప్రధాని
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:05 PM
జీ7 సమ్మిట్(G7 Summit) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) భేటీ అయిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటి సారి విదేశీ పర్యటకు వెళ్లారు. దీంతో ఈ టూర్ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జార్జియా మెలోని(Giorgia Meloni) ప్రధాని మోదీ(modi)తో కలిసి నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
జీ7 సమ్మిట్(G7 Summit) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) భేటీ అయిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటి సారి విదేశీ పర్యటకు వెళ్లారు. దీంతో ఈ టూర్ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటలీ(Italy)లోని అపులియాలో జరిగిన జీ7 సమావేశంలో ఈసారి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జార్జియా మెలోని కీలక నేతలకు స్వాగతం పలికారు. అదే రీతిలో ప్రధాని మోదీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కూడా అయ్యాయి.
ఈ క్రమంలోనే జార్జియా మెలోని(Giorgia Meloni) ప్రధాని మోదీ(modi)తో కలిసి నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రపంచ నేతలిద్దరూ కూడా ఒకరికొకరు హాయిగా నిలబడి నవ్వుతున్నారు. ఆ క్రమంలో ఇటలీ ప్రధాని.. మోదీ దగ్గరగా వచ్చి నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రం ఆకట్టుకుంటుంది. ఈ పిక్ చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. పలువురు వావ్ అని అంటుండగా, మరికొంత మంది మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ(delhi)కి తిరుగు ప్రయాణమయ్యారు. తన ఒకరోజు పర్యటన ముగించుకుని మోదీ ఇటలీ నుంచి బయలుదేరారు. ఆ క్రమంలో అపులియాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో తాను ప్రపంచ వేదికపై భారతదేశ దృక్పథాన్ని ప్రదర్శించానని సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని ఓ వీడియోను షేర్ చేశారు. వీడియోలో మోదీ జీ7 సమావేశాల్లో పాల్గొనడం, అందులో భాగంగా పలువురు నేతలతో జరిగిన చర్చలు, కార్యక్రమాల ప్రధానాంశాలు కనిపిస్తున్నాయి.
ఈ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. దీంతోపాటు ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, పోప్ ఫ్రాన్సిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి నేతలతో కూడా సమావేశమైనట్లు వీడియో ద్వారా తెలస్తోంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రజలు, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి:
Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..
EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!
Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..
Read Latest National News and Telugu News