Share News

Priviledge Motion notice: అమిత్‌షా 'ఎర్లీ వార్నింగ్'పై జైరాం రమేష్ సభా హక్కుల నోటీసు

ABN , Publish Date - Aug 02 , 2024 | 07:26 PM

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు కేంద్ర హోం శాఖ అమిత్‌షా రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ 'సభా హక్కుల నోటీసు'ను పెద్దల సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.

Priviledge Motion notice: అమిత్‌షా 'ఎర్లీ వార్నింగ్'పై జైరాం రమేష్ సభా హక్కుల నోటీసు

న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు (Early Warning) కేంద్ర హోం శాఖ అమిత్‌షా (Amit shah) రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) 'సభా హక్కుల నోటీసు' (Privilege Motion notice)ను పెద్దల సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.


''కేంద్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్టు కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన అబద్ధమని తేలింది. ఇది ఒక మంత్రిగా ఆయన సభను తప్పుదారి పట్టించడమే అవుతుంది'' అని జైరామ్ రమేష్ ఆ నోటీసులో పేర్కొన్నారు.

Wayanad Landslides: పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నాం.. వయనాడ్ వైద్యుల ఆవేదన


అమిత్‌షా ఏమన్నారంటే..

భారీ వర్షాల కారణగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని రాజ్యసభలో ఇటీవల అమిత్‌షా ఒక ప్రకటన చేశారు. ముప్పు గురించి జూలై 23నే అప్రమత్తం చేశామన్నారు. కేంద్రం 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని, కానీ కేరళ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, సకాలంలో ప్రజలను తరలించలేదని అన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవించేవి కావని చెప్పారు. అయినప్పటికీ ఈ విపత్కర సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కేరళ ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు.

For Latest News and National News Click Here

Updated Date - Aug 02 , 2024 | 07:27 PM