Share News

Jammu and Kashmir Assembly Elections: పోలింగ్ ప్రశాంతం.. 65.65 శాతం ఓటింగ్ నమోదు

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:08 PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. రికార్డు స్థాయిలో 65.65 శాతం పోలింగ్ నమోదైంది.

Jammu and Kashmir Assembly Elections: పోలింగ్ ప్రశాంతం.. 65.65 శాతం ఓటింగ్ నమోదు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Assembly Elections) తుది విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. రికార్డు స్థాయిలో 65.65 శాతం పోలింగ్ నమోదైంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తుది విడత పోలింగ్‌లో భాగంగా 40 సీట్లలో పోలింగ్ జరుగగా, 24 సీట్లు జమ్మూలోనూ, 16 సీట్లు కాశ్మీర్‌లోనూ ఉన్నాయి. అత్యధికంగా సాంబ జిల్లాలో 75.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా బారాముల్లాలో 55.73 శాతం పోలింగ్ నమోదైంది.

MHA: 14 రాష్ట్రాలకు వరద సాయంగా రూ.5,858 కోట్లు విడుదల చేసిన కేంద్రం


పోలింగ్‌కు ముందు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో (ఎన్నికల్లో) పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపునిచ్చింది. అందుకు అనుగుణంగా గణనీయంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చారు. మూడు విడతల పోలింగ్‌లో భాగంగా తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగగా, 65.52 శాతం పోలింగ్ నమోదైంది. సెప్టెంబర్ 25న జరిగిన రెండో విడత పోలింగ్‌లో 57.31 శాతం పోలింగ్ నమోదైంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Updated Date - Oct 01 , 2024 | 09:08 PM