Share News

Elections: మొదలైన ఎన్నికల పోలింగ్.. అక్కడ గెలిచేదెవరో?

ABN , Publish Date - Nov 13 , 2024 | 08:30 AM

Elections: దేశంలో మరో కీలక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలింగ్ కూడా మొదలైపోయింది. దీంతో అక్కడి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది.

Elections: మొదలైన ఎన్నికల పోలింగ్.. అక్కడ గెలిచేదెవరో?

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ తాజాగా ప్రారంభమైంది. ఇవాళ అక్కడి 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్ల ఫ్యూచర్‌ను ఓటర్లు తేల్చనున్నారు. తొలి విడత పోరులో మొత్తం 683 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఫస్ట్ ఫేజ్‌లో 1.37 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ తొలి విడత ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన అభ్యర్థుల జాబితాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు బన్నా గుప్తా, రాజ్యసభ్య సభ్యుడు మహువా మాఝీతో పాటు మాజీ సీఎం మధు కోడా భార్య గీతా కోడా, మరో మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా దాస్ ఉన్నారు. జార్ఖండ్‌తో పాటు కేరళలోని వయానాడ్‌లోనూ ఎన్నికల పోలింగ్ షురూ అయింది.


బరిలో ప్రియాంక

వయానాడ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేత ప్రియాంక గాంధీ బరిలో ఉండటంతో అక్కడి పోలింగ్ ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్‌, వయానాడ్‌తో పాటు దేశంలోని మరో 31 చోట్ల బుధవారం పోలింగ్ మొదలైంది. మొత్తంగా 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అయితే సిక్కింలోని 2 నియోజకవర్గాలను క్రాంతికారీ మోర్చా పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో మిగిలిన 31 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.


కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం

ఉప ఎన్నికల్లో అందరి ఫోకస్ జార్ఖండ్‌తో పాటు వయానాడ్ మీద ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో వయానాడ్‌తో పాటు రాయ్‌బరేలీలో గెలిచారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ తర్వాత వయానాడ్‌ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఇక్కడి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. ఈ నియోజకవర్గంలో ప్రియాంకతో పాటు ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరి, బీజేపీ క్యాండిడేట్ నవ్య హరిదాస్‌ బరిలో నిలిచారు.


Also Read:

బాబు.. పవర్‌ఫుల్‌ సీఎం!

ఉగ్రవాదుల్లో పాక్‌వాసులే అధికం

మతమార్పిళ్లకు పాల్పడే ఎన్జీవోలపై కన్నెర్ర

For More National And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 09:51 AM