Share News

Champai Soren: జార్ఖండ్‌లో మరో సంచలనం.. చంపాయ్ సోరెన్ కొత్త పార్టీ..?

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:24 PM

Jharkhand Politics: జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ ఢిల్లీ నుండి సెరైకెలాలోని తన ఇంటికి చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన జేఎంఎంను వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ కారణంగానే..

Champai Soren: జార్ఖండ్‌లో మరో సంచలనం.. చంపాయ్ సోరెన్ కొత్త పార్టీ..?
Champai Soren

Jharkhand Politics: జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ ఢిల్లీ నుండి సెరైకెలాలోని తన ఇంటికి చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన జేఎంఎంను వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ కారణంగానే ఆయన ఢిల్లీకి వెళ్లారని.. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో జార్ఖండ్‌ ప్రభుత్వంలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని అంతా అంచనా వేశారు. కానీ ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన చంపాయ్ మాత్రం సమాధానం డిఫరెంట్‌గా చెప్పారు. తన మనవడి కళ్లద్దాలు బాగు చేయించడానికి ఢిల్లీ వెళ్లానని మీడియా ప్రతినిధులకు బదులిచ్చారు. దీంతో అంతా అవక్కాయ్యారు.


వాస్తవానికి జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ అరెస్ట్‌ అవగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంపాయ్ సోరెన్.. ఇప్పుడు ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. హేమంత్‌కు బెయిల్ రావడం, తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవడంతో చంపాయ్ సోరెన్, ఆయన అనుచర ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే.. తాజాగా చంపాయ్ సోరెన్ తన ఎక్స్ ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించడం.. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం అని అంతా భావించారు. కానీ, ఈ విషయంలో చంపాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. వ్యక్తిగత పనుల కోసం తాను ఢిల్లీకి వెళ్లానని చంపాయ్ చెప్పుకొచ్చారు. తన కూతురు, మనవడు ఢిల్లీలో ఉన్నారని.. వారి కోసమే ఢిల్లీకి వెళ్లానన్నారు. అంతేకాదు.. మనవడి కళ్లద్దాలు పగిలిపోయాయని.. వాటిని బాగు చేయించేందుకు ఢిల్లీ వెళ్లానని కూడా చెప్పుకొచ్చాడు. ఈ మాటే ఇప్పుడు మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది. కళ్లద్దాలు బాగుచేయించేందుకు ఢిల్లీకి వెళ్లారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


చంపాయ్ రూటు ఎటు..?

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను చాలా అవమానాలు భరించానని చెప్పిన చంపాయ్.. ఇప్పుడు జేఎంఎంలోనే కొనసాగుతారా? లేక బీజేపీలో చేరుతారా? అనేది సస్పెన్స్‌గా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన చంపాయ్ సోరెన్.. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. తనకు రెండు ఆప్షన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరి ఆ రెండు ఆప్షన్లు ఏంటి? అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఎక్స్‌లో జేఎంఎం పేరును తొలగించిన ఆయన ఆ పార్టీలో కొనసాగే అవకాశం అయితే దాదాపు లేదని అంచనా వేస్తున్నారు. ఒక ఆప్షన్ బీజేపీలో చేరడం.. రెండో ఆప్షన్ కొత్త పార్టీ పెట్టడం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఢిల్లీ వెళ్లి వచ్చిన చంపాయ్ సోరెన్.. తాను బీజేపీలో చేరడం లేదంటూ ప్రకటించారు. అంటే మిగిలింది మరొకటే ఆప్షన్. అదే కొత్త పార్టీ స్థాపన.


చంపాయ్ కొత్త పార్టీ పెడతారా?

బీజేపీలో చేరనని.. రాజకీయాల నుంచి తప్పుకోనని ప్రకటించిన చంపాయ్.. రానున్న రోజుల్లో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి జార్ఖండ్ రాష్ట్ర సాధనలో చంపాయ్ సోరెన్ చాలా కీలక పాత్ర పోషించారు. ఆయనను జార్ఖండ్ టైగర్ అని కూడా పిలుస్తారు. ప్రజల్లో మంచి పట్టు, ప్రాబల్యం ఉంది. అందుకే.. ఆయన పార్టీ పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు.


పార్టీ పెట్టకపోతే బీజేపీలో చేరుతారా?

చంపాయ్ సోరెన్ సొంత పార్టీని ఏర్పాటు చేయకపోతే మరికొద్ది రోజుల్లోనే ఆయన బీజేపీలో చేరడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైకి తాను బీజేపీలో చేరబోవడం లేదని ప్రకటిస్తున్నప్పటికీ.. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని అంచనా వేస్తున్నారు. మరి చంపాయ్ సోరెన్ అడుగులు ఎటువైపు వేస్తారనేది స్పష్టంగా తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Also Read:

బాబు కాదు.. ఢిల్లీలో ఇకపై చక్రం తిప్పేది చినబాబేనట..!!

ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా?

జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చొద్దు...

For More National News and Telugu News..

Updated Date - Aug 21 , 2024 | 01:24 PM