Share News

Karnataka: 14 గంటల డ్యూటీపై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల నిరసన

ABN , Publish Date - Jul 26 , 2024 | 06:07 AM

ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు పని సమయం 14 గంటలకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై టెకీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వారు నిరసన తెలుపుతున్నారు.

Karnataka: 14 గంటల డ్యూటీపై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల నిరసన

బెంగళూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు పని సమయం 14 గంటలకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై టెకీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వారు నిరసన తెలుపుతున్నారు. రెండురోజులుగా ప్రాంతాల వారీగా రోడ్లెక్కి నిరసనలకు దిగుతున్నారు. మడివాళ, బీటీఎం లే అవుట్‌ ప్రాంతాల్లో టెకీలు బుధవారం రాత్రి పొద్దుపోయాక రోడ్లపైకి చేరి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ కార్మిక సంస్థ చట్టాలను ఉల్లంఘించే చర్యలు తీవ్రమవుతున్నాయని, ఇప్పటికే ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలంటే మానవవనరులపై దాడిలా మారిపోయాయని మండిపడ్డారు.


ఏకంగా 14 గంటల పాటు పనిచేయడమనే నిబంధన ఉద్యోగిని మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడమే అని అన్నారు. ఎలకా్ట్రనిక్‌ సిటీకి సమీపాన ఉండే ప్రాంతంలో జరిగిన ఆందోళన కావడంతో పెద్దఎత్తున టెకీలు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో నిరసన సాగించారు. టెకీలు మెయిల్‌ ద్వారా నిరసన అస్ర్తాన్ని ప్రయోగించదలచారు. కార్మికశాఖా మంత్రితో పాటు ముఖ్యమంత్రి, డీసీఎంలకు మెయిల్‌ ద్వారా నిరసన తెలుపదలచినట్లు వెల్లడించారు.

Updated Date - Jul 26 , 2024 | 06:07 AM