Share News

Kerala High Court: క్రమశిక్షణ కోసం కొడితే టీచరుపై కేసు పెట్టొద్దు

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:59 AM

క్రమశిక్షణ పెంపొందించాలన్న సదుద్దేశంలో విద్యార్థులను కొట్టే ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

Kerala High Court: క్రమశిక్షణ కోసం కొడితే టీచరుపై కేసు పెట్టొద్దు

కోచి, జూలై 5: క్రమశిక్షణ పెంపొందించాలన్న సదుద్దేశంలో విద్యార్థులను కొట్టే ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. తోత్తువలోని సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, అక్కడి ఇంగ్లిష్‌ టీచరు జోమీపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే 13 ఏళ్ల విద్యార్థినికి మంచి మార్కులు రాకపోవడంతో ఆమెను టీచరు జోమీ కొట్టారు. దాంతో తల్లిదండ్రులు ఆమెపైనా, పాఠశాల ప్రిన్సిపాల్‌పైనా కొడనాడ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 75 కింద నేరం చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయుంచారు. ఆ బాలికను దండించడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. ఆమెను క్రమశిక్షణలో ఉంచాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇచ్చిన అవ్యక్త అఽధికారంతో ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు.

Updated Date - Jul 06 , 2024 | 04:59 AM