Share News

Kolkata: చేతులెత్తేసిన మమత సర్కార్.. కోల్‌కతా ఫుట్‌బాల్ మ్యాచ్ రద్దు

ABN , Publish Date - Aug 18 , 2024 | 11:48 AM

ఈస్ట్ బెంగాల్ వెర్సస్ మోహన్ బాగాన్ డెర్బీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. మ్యాచ్‌కు తగిన భద్రత కల్పించలేమని కోల్‌కతా పోలీసులు అసక్తత వ్యక్తం చేయడంపై బీజేపీ మండిపడింది.

Kolkata:  చేతులెత్తేసిన మమత సర్కార్.. కోల్‌కతా ఫుట్‌బాల్ మ్యాచ్ రద్దు

కోల్‌కతా: ఈస్ట్ బెంగాల్ వెర్సస్ మోహన్ బాగాన్ డెర్బీ (East Bengal Vs Mohun Bagan derby) జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ (Durund Cup FootBall Tournment 2024)ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. మ్యాచ్‌కు తగిన భద్రత కల్పించలేమని కోల్‌కతా పోలీసులు డ్యూరాండ్ కప్ ఆర్గనేజింగ్ కమిటీ (డీసీఓసీ)కి సమాచారం ఇవ్వడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. రెండు టీమ్‌లకు చెరో పాయింట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది. కాగా, ఫుట్‌బాల్ మ్యాచ్‌ను బెంగాల్ సర్కార్ రద్దు చేయడంపై బీజేపీ మండిపడింది.

Kolkata rape-murder protest: మెడికల్ కాలేజీ పరిసరాల్లో 7 రోజుల పాటు సెక్షన్ 163


నిరసలన భయంతోనే...

ఇమామీ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ, మోహన్ బాగాన్ సూపర్ జెయింట్ల మధ్య మ్చాచ్ కోసం అందరూ ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తున్న తరుణంలో కేవలం నిరసనల భయంతోనే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు. టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయని, ఈ దశలో మ్యాచ్‌కు భద్రత కల్పించలేమనే సాకుతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ మమత సర్కార్ అసాధారణ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే దీనివెనుక నిజమైన కారణం ఒకటి ఉందని ఆయన చెప్పారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్, సీఎం రాజీనామా డిమాండ్‌తో ఫుట్‌బాల్ టీమ్ జట్ల మద్దతుదారులు ప్లకార్లుల ప్రదర్శన నిర్వహించాలనుకున్నట్టు చెప్పారు. సామూహిక నిరసనలకు భయపడే మ్యాచ్‌ను బెంగాల్ సర్కార్ రద్దు చేసినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాలవీయ తెలిపారు. మ్యాచ్‌కు హాజరయ్యే 60,000 మందికే భద్రత కల్పించలేని ప్రభుత్వం రాష్ట్రంలోని 10 కోట్ల మంది జనాభాకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందని నిలదీశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 11:48 AM