Share News

Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:35 PM

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నని సీట్లు మాత్రం గెలుచుకో లేక పోయింది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాలను కైవసం చేసుకుంది.

Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

లఖ్‌నవూ, జులై 17: దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నని సీట్లు మాత్రం గెలుచుకో లేక పోయింది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాలను కైవసం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ గెలుపు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Aadhaar number:‘ఆధార్ నెంబర్‌’ తో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం


త్వరలో ఉత్తరప్రదేశ్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగునుంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. బీజేపీ యూపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి సైతం నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అంతరం వీరిద్దరు ఎవరికీ వారు... మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

Also Read: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ


ఆదివారం బీజేపీ కీలక నేతల భేటీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కంటే తన ఆర్గనైజేషన్ పెద్దదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో యూపీ బీజేపీలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ డిప్యూటీ సీఎం మౌర్యకు జేపీ నడ్డా హితవు పలికినట్లు తెలుస్తుంది. ఈ తరహా వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సందేశాలు వెళ్లే అవకాశముందంటూ పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ ఉప ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాలని ఆదేశించారనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో గెలుపుపై ఈ రోజు ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. తన నివాసంలో కేబినెట్‌ మంత్రులతో సమావేశమయ్యారు.


మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మధ్య దూరం పెరిగిందంటూ చాలా కాలంగా ఓ చర్చ అయితే నడుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం.. సీఎం యోగి పని విధానమేనని ఓ వాదన సాగుతుంది. ఇక సీఎం మద్దతుదారులు మాత్రం.. పార్టీ హిందుత్వ ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా.. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన గట్టి పట్టును సాధించారని పేర్కొంటున్నారు.


ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు 36 సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 64 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతల అతి ఆత్మవిశ్వాసమే ఈ ఫలితాలకు కారణమే వ్యాఖ్యలు సైతం సీఎం యోగి గతంలో పేర్కొన్న విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 05:55 PM