Share News

Mathura: మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం..?

ABN , Publish Date - Feb 11 , 2024 | 02:41 PM

మథురలో శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మించాల్సి ఉందని కొందరు అంటున్నారు. ఇదే అంశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.

Mathura: మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం..?

ముంబై: అయోధ్యలో రాములోరి ఆలయ నిర్మాణం జరిగింది. 5 శతాబ్దాల హిందువుల కల నెరవేరింది. భక్తుల నుంచి బాల రాముడు పూజలను అందుకుంటున్నారు. తర్వాత మథురలో (Mathura) శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మించాల్సి ఉందని కొందరు అంటున్నారు. ఇదే అంశంపై ఇటీవల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.

శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర అని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ ఆలయం ఉంది. జ్ఞానవాపి మసీదు కూడా ఉంది. మసీద్, మందిర్‌కు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మందిరం వద్ద పూజలు చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. శ్రీకృష్ణుడి జన్మస్థానం అయిన మథురలో సామరస్యంగా, చట్టపరంగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతాయని దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు.

రాములోరి జన్మస్థలంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని, కృష్ణుడి ఆలయం నిర్మాణం జరగాల్సి ఉందని ఫడ్నవీస్ అంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో శ్రీ కృష్ణుడి జన్మభూమి నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మథురలో సాహి ఈద్గా మసీదు ఉన్న చోటు శ్రీ కృష్ణుని జన్మస్థలం అని హిందువులు స్పష్టం చేశారు. ఆ ప్రక్రియ న్యాయ పరంగా పూర్తి అవుతుందని ఫడ్నవీస్ అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 02:41 PM