Share News

CAA: పాలస్తీనియన్లకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా.. అగ్రరాజ్యానికి భారత్ సూటిప్రశ్న

ABN , Publish Date - Mar 17 , 2024 | 01:32 PM

సీఏఏపై అమెరికా చేసిన కామెంట్లపై భారత తరఫు నిపుణులు ఘాటుగా స్పందిస్తున్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛ, దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్న అమెరికా సీఏఏ అమలును అమెరికా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

CAA: పాలస్తీనియన్లకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా.. అగ్రరాజ్యానికి భారత్ సూటిప్రశ్న

సీఏఏపై అమెరికా చేసిన కామెంట్లపై భారత తరఫు నిపుణులు ఘాటుగా స్పందిస్తున్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛ, దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్న అమెరికా సీఏఏ అమలును అమెరికా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ:ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, NDTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి యునైటెడ్ స్టేట్స్ చేసిన ఇటీవలి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే తీవ్రంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్న మైనారిటీలకు అమెరికా తన సరిహద్దులు తెరుస్తుందా అని ప్రశ్నించారు.

పాకిస్తాన్‌లోని అహ్మదీయులకు, మయన్మార్‌లోని రోహింగ్యాలకు, పాలస్తీనియన్లకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా. అలాంటప్పుడు ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం ఎందుకు అని హరీశ్ సాల్వే ఘాటుగా అన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంపై అమెరికా పునరాలోచించాలని హితవు పలికారు. సీఏఏ ద్వారా ముస్లిం మెజారిటీ దేశాలైన బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ లో వివక్షకు గురవుతున్న మైనారిటీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు, బౌద్ధులు, జైనులకు భారత పౌరసత్వం అందించనున్నారు. మతపరమైన హింస కారణంగా డిసెంబర్ 31, 2014 కు ముందు భారత్ లోకి వచ్చిన వారికి ఈ వెసులుబాటు కల్పించింది.


ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్న పాకిస్థాన్‌లో పరిస్థితులు మారిపోయాయని సాల్వే అన్నారు. బంగ్లాదేశ్ సైతం తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుందన్నారు. తాలిబాన్ల కారణంగా అఫ్గానిస్థాన్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో మనందరికీ తెలిసిందే అని సాల్వే చెప్పారు. ఈ ఇస్లామిక్ రాష్ట్రాల్లో తమ స్వంత మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడానికి అవకాశం లేని వారికి పౌరసత్వం ఇచ్చేందుకే సీఏఏను తీసుకువచ్చామని సాల్వే స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2024 | 01:36 PM