Maharashtra Polls: ఎంవీఏ కీలక అడుగు.. 190 సీట్లలో ఏకాభిప్రాయం
ABN , Publish Date - Oct 07 , 2024 | 09:09 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండటంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి' కూటమి సీట్ల పంపకాలపై కీలక అడుగు పడింది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండటంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి' (MVA) కూటమి సీట్ల పంపకాలపై కీలక అడుగు పడింది. కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన (UBT), శరద్ పవార్ సారథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-SP), కాంగ్రెస్ (Congress) మధ్య సీట్ల పంపకాలకు సంబంధించి మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 190 సీట్లలో అవగాహన కుదిరింది. మరో 100 సీట్ల విషయంలో భాగస్వామ్య పార్టీలు చర్చలు కొనసాగించనున్నాయి.
P Chidambaram: హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలను తేల్చిచెప్పిన చిదంబరం
ఈ వారంలోనే మరోసారి..
సీట్ల పంపకాలను ఖరారు చేసేందుకు ఎంవీఏ నేతలు ముంబైలోని ట్రిడెంట్ హోటల్‌లో సోమవారంనాడు సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల సేపు సమావేశం జరిగింది. కాంగ్రెస్ నేతలు నానా పటోలే, బాలాసాహెబ్ థోరట్, విజయ్ వాడెట్టివార్, శివసేన యూబీటీ నుంచి సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్, ఎస్‌సీపీ ఎస్‌పీ నుంచి జయంత్ పాటిల్, జితేంద్ర అవధ్, రాజేష్ తోపె, అనిల్ దేశ్‌ముఖ్ పాల్గొన్నారు. భాగస్వాముల మధ్య తక్కిన సీట్లపై ఈ వారంలోనే మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. విదర్భ, ముంబై-కొంకణ్ ప్రాంతం, మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో సహా సుమారు 100 సీట్ల వ్యవహారం కొలిక్కి రావాల్సి ఉంది.
సానుకూల చర్చలు
ఎంవీఏ నేతల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగిన్టటు సమావేశానంతరం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. దసరా తర్వాత కొన్ని సీట్లను ఎంపీవీ ప్రకటించే అవకాశం ఉందన్నారు. హర్యానా, జమ్మూకశ్మీర్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడనున్నట్టు ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్రంలోనూ ఇదే మార్పు తథ్యమని, కాంగ్రెస్ అలయెన్స్ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలోకి వస్తుందని అన్నారు.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి...