Share News

Makara Jyothi 2024: భక్తజన సంద్రంగా శబరిమల..మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు

ABN , Publish Date - Jan 15 , 2024 | 06:44 PM

పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి 'మకర జ్యోతి' దర్శనం చేసుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.

Makara Jyothi 2024: భక్తజన సంద్రంగా శబరిమల..మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు

పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి 'మకర జ్యోతి(Makara Jyothi)' దర్శనం చేసుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది. జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శబరిమలకు 4 కిలోమీటర్ల దూరంలోని పొన్నంబలమేడుకు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక ప్రాంతాల్లో ఉన్న అయ్యప్పమాల ధరించిన భక్తులతోపాటు అనేక మంది తరలివెళ్లారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి : Ayodhya Ram Temple: ప్రాణప్రతిష్ఠ సమయం ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..

మకరజ్యోతి దర్శనం కోసం లక్ష మంది భక్తులు తరలివస్తుండటంతో చూసేందుకు 10 వ్యూపాయింట్లను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పులిమేడు, పరుంతుంపర, పాంచాలిమేడులో కూడా దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది డీఎస్పీల ఆధ్వర్యంలో 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మకర జ్యోతి దక్షిణాది ప్రజలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మకరజ్యోతిని దర్శించుకుంటే అదృష్టం, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు.

Updated Date - Jan 15 , 2024 | 08:00 PM