Share News

Manish Sisodia: ‘నిజాయితీకి ప్రతీక.. అరవింద్ కేజ్రీవాల్’

ABN , Publish Date - Aug 10 , 2024 | 01:08 PM

అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అలాంటి ఆయన్ని దెబ్బ తీసేందుకు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ వినియోగించుకుంటుందని ఆరోపించారు. అందులోభాగంగానే కేంద్రంలోని మోదీ సర్కార్.. ఆప్ నేతలపై తప్పడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుందని ఆయన మండిపడ్డారు.

Manish Sisodia: ‘నిజాయితీకి ప్రతీక.. అరవింద్ కేజ్రీవాల్’
AAP MLA Manish Sisodia

న్యూఢిల్లీ, ఆగస్ట్ 10: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో జైలు నుంచి విడులవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.

అలాంటి ఆయన్ని దెబ్బ తీసేందుకు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ వినియోగించుకుంటుందని ఆరోపించారు. అందులోభాగంగానే కేంద్రంలోని మోదీ సర్కార్.. ఆప్ నేతలపై తప్పడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుందని ఆయన మండిపడ్డారు.

Also Read: Agniveers passing out parade: ‘అగ్నివీర్’పై భారత నేవీ చీఫ్ ప్రశంసల జల్లు


పార్టీ శ్రేణుతో సిసోడియా భేటీ.. రాజ్‌ఘాట్‌కు వెళ్లి..

శనివారం న్యూఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మనీశ్ సిసోడియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు పార్టీ కార్యక్తరలే తమకు నిజమైన బలమన్నారు. తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం.. నియంత పాలనకు చెంప పెట్టు అని ఆయన పేర్కొన్నారు.

Also Read: Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్


ఈ సందర్భంగా తన బెయిల్‌పై వాదనలు కొనసాగించిన తన తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్ మను సింఘ్వీ‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతకుముందు న్యూఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ సమాధిని మనీశ్ సిసోడియా సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు. అలాగే కన్నాట్ ప్లేస్‌లోని హానుమాన్ దేవాలయాన్ని సైతం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు అందుకున్నారు.

Kolkata doctor murder:వైద్య విద్యార్థి హత్య.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో వెలుగులోకి కీలక విషయాలు


నో బెయిల్.. 17 నెలలు జైల్లోనే..

గతేడాది ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి హోదాలో మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. తీహాడ్ జైలుకు తరలించారు. అనంతరం ఇదే కేసులో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆయన పలుమార్లు కోర్టులను ఆశ్రయించారు. అయినా. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగస్ట్ 9వ తేదీన సుప్రీంకోర్టు..మనీశ్ సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శుక్రవారం విడుదలయ్యారు.

Also Read: Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్


భార్యతో సెల్పీ దిగి ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన...

మరోవైపు జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోడియా శనివారం ఉదయం తన భార్య సీమాతో కలిసి టీ తాగుతూ... సెల్పీ దిగారు. ఆ సెల్పీతోపాటు 17 నెలలకు లభించిన స్వేచ్చ తర్వాత ఉదయం ఇంట్లో టీ తాగుతున్నాను. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్చగా జీవించే హక్కు కల్పించింది. ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే హక్కును ఆ దేవుడు అందరికీ కల్పించాడంటూ కామెంట్ జత చేసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే శుక్రవారం జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోడియా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి.. అయన తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న విషయం విధితమే.

Also Read: wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 01:22 PM