Share News

Minister Kumaraswamy : సిద్దరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయండి

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:32 AM

మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిలో సీఎం సిద్దరామయ్య కుటుంబ భాగస్వామ్యం, వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ గ్రాంట్లు బినామీ ఖాతాలకు ....

Minister Kumaraswamy : సిద్దరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయండి

  • న్యాయవాదులకు కేంద్రమంత్రి కుమారస్వామి సూచన

బెంగళూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిలో సీఎం సిద్దరామయ్య కుటుంబ భాగస్వామ్యం, వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ గ్రాంట్లు బినామీ ఖాతాలకు మళ్లించడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి న్యాయవాదులకు సూచించారు.

బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై దేశమంతటా చర్చ సాగుతోందన్నారు. కోర్టులను ఆశ్రయించి వివాదంపై చట్టపరంగా పోరాటం చేయాలన్నారు. డీ నోటిఫికేషన్‌ విషయంలో అప్పటి సీఎం యడియూరప్పపై న్యాయ పోరాటానికి అడ్వకేట్లు గవర్నర్‌ అనుమతులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ కారణంతోనే యడియూరప్ప 2011లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. దేశంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే మార్చిలో వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ ఖాతాల నుంచి రూ.94 కోట్లు బినామీ ఖాతాలకు జమ చేశారని ఆరోపించారు.

Updated Date - Jul 15 , 2024 | 03:32 AM