Share News

Moody's: మోదీ ప్రధాని అవుతున్నా.. బీజేపీ బలహీనపడింది: మూడీస్

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:26 AM

కేంద్రంలో మళ్లీ మోదీ(PM Modi) ప్రధాని పదవి చేపడుతున్నా.. బీజేపీ బలం భారీగా తగ్గిందని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. మూడీస్ శుక్రవారం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో Baa3 రేటింగ్‌లను ధ్రువీకరించింది.

Moody's: మోదీ ప్రధాని అవుతున్నా.. బీజేపీ బలహీనపడింది: మూడీస్

ఢిల్లీ: కేంద్రంలో మళ్లీ మోదీ(PM Modi) ప్రధాని పదవి చేపడుతున్నా.. బీజేపీ బలం భారీగా తగ్గిందని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. మూడీస్ శుక్రవారం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో Baa3 రేటింగ్‌లను ధ్రువీకరించింది.

ఈ బ్యాంకుల రేటింగ్‌లపై రేటింగ్ ఏజెన్సీ స్థిరమైన దృక్పథాన్ని కొనసాగించింది. అదే సమయంలో మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నప్పటికీ, బీజేపీ బాగా బలహీనపడిందని స్పష్టం చేసింది. ‘భారత ఎన్నికల సమీక్ష, సంకీర్ణ ప్రభుత్వంలోకి బీజేపీని చేర్చిన ఓటర్లు’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పార్లమెంటులో లెక్కలు మార్చాయని, సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుందని వెల్లడించింది.


కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేందుకు బీజేపీ కొన్నిసార్లు రాజీపడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. తద్వారా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తుందని తెలిపింది. కీలక నిర్ణయాల నుంచి బీజేపీ తప్పుకోవాల్సి రావొచ్చని చెప్పింది. లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ స్థిరత్వం తగ్గడం, సంకీర్ణ ప్రభుత్వంలో ఏకాభిప్రాయ సాధన అవసరం ఉండటం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని తగ్గించవచ్చని మూడీస్‌ ఆర్థికవేత్త అదితి చెప్పారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక, ఆర్థిక అసమానతలు తదితర సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం ఎలా మసులుకుంటుందనే అంశాన్ని మార్కెట్లు గమనిస్తాయని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే భారత అభివృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు. రానున్న ఐదేళ్లు మోదీకి క్లిష్ట సవాళ్లు ఎదురుకాబోతున్నాయని స్పష్టం చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jun 08 , 2024 | 11:26 AM