Share News

MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:47 PM

మైసూరు అర్బన్‌ డెవలప్‌మెమంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాత్ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌండర్ ధర్మాసనం ఈ రోజు విచారించనుంది.

MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, ఆగస్ట్ 19: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ఆ రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టారు. మైసూరు అర్బన్‌ డెవలప్‌మెమంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాత్ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌండర్ ధర్మాసనం ఈ రోజు విచారించనుంది.

Also Read: Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్


ఏ తప్పు చేయలేదు..

సీఎం సిద్దరామయ్య సోమవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదన్నారు. గవర్నర్ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరినట్లు తెలిపారు. దీనిపై ప్రముఖ న్యాయవాదీ అభిషేక్ మును సింఘ్వీ వాదిస్తారని చెప్పారు. తన జీవితంలో నాలుగు దశాబ్దాల పాటు మంత్రిగా కొనసాగానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ ఏ నాడు చిన్న మచ్చ అనేది లేకుండా ఉన్నానన్నారు. తన మనస్సాక్షి.. ఏ తప్పు చేయలేదని స్పష్టంగా చెబుతుందని సీఎం సిద్దు పేర్కొన్నారు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం


ప్రజల దీవెనలే శ్రీరామరక్ష..

ప్రజల దీవెనలే తనకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అలాగే తాను ఏ తప్పు చేయనని ఈ రాష్ట్ర ప్రజలకు సైతం తెలుసునని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రమేశ్ బాబు లేఖ రాశారు. ఇది రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి పూర్తి విరుద్దమని వ్యాఖ్యానించారు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వంపై దాడి అని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేస్తున్న కుట్రలో భాగమే ఈ నిర్ణయాలని ఆ లేఖలో రమేశ్ బాబు పేర్కొన్నారు. రాజకీయ ప్రతీకారం కోసం గవర్నర్ కార్యాలయం పని చేస్తున్నట్లుగా ఉందన్నారు.

Also Read: TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ


రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..

ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు కర్ణాటక గవర్నర్ గెహ్లాత్ అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, తాలుక కేంద్రాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించింది. అలాగే ఎక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వీటిని చేపట్టాలని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆదేశించిన విషయం విధితమే. ఇంకోవైపు తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో.. ఆదివారం సిఎం సిద్దరామయ్య.. తన అధికారికి కార్యక్రమాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 04:47 PM