Share News

Mumbai : మహారాష్ట్రలో ‘సీఎం’ అభ్యర్థి లేకుండా ఎన్నికలకు!

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:33 AM

ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడదామని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది.

Mumbai : మహారాష్ట్రలో ‘సీఎం’ అభ్యర్థి లేకుండా ఎన్నికలకు!

  • కాంగ్రెస్‌ ప్రతిపాదన.. పవార్‌, ఉద్ధవ్‌ సేన మద్దతు అనుమానమే

ముంబై, ఆగస్టు 11: ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడదామని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఖరారుచేద్దామని ‘మహా వికాస్‌ అఘాడీ’లోని భాగస్వామ్య పక్షాలైన ఉద్ధవ్‌ శివసేన, శరద్‌ పవార్‌ ఎన్‌సీపీలకు సూచించింది.

అయితే దీనిని ఉద్ధవ్‌ శివసేన అంగీకరించడం సందేహమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఉద్ధవ్‌ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌సీపీ (పవార్‌) కూడా సమర్థిస్తున్నారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు అఘాడీ 30 చోట్ల గెలిచింది. ఇందులో కాంగ్రెస్‌ అత్యధికంగా 13 సీట్లు సాధించింది. కూటమికి తానే నాయకత్వం వహించాలని కాంగ్రెస్‌ ఆశపడుతోంది.

Updated Date - Aug 12 , 2024 | 03:35 AM