Share News

Karnataka Jobs: కర్ణాటక కోటా బిల్లు దుమారం..!!

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:13 PM

కర్ణాటక కోటా బిల్లు తీవ్ర దుమారం రేపతోంది. ప్రైవేట్ కంపెనీలు, ఇండస్ట్రీస్‌లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించింది. ఆ బిల్లుపై ఇంటా బయటా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెంగళూర్‌లో ఉండే స్థానికేతరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ పే కో ఫౌండర్ సమీర్ నిగమ్ స్పందించారు.

Karnataka Jobs: కర్ణాటక కోటా బిల్లు దుమారం..!!
PhonePe Founder Sameer Nigam

బెంగళూర్: కర్ణాటక కోటా బిల్లు తీవ్ర దుమారం రేపతోంది. ప్రైవేట్ కంపెనీలు, ఇండస్ట్రీస్‌లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించింది. ఆ బిల్లుపై ఇంటా బయటా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెంగళూర్‌లో ఉండే స్థానికేతరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ పే కో ఫౌండర్ సమీర్ నిగమ్ (Sameer Nigam) స్పందించారు.


బిల్లు ఏంటంటే..?

కర్ణాటకలో గల ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీల్లో మెనేజ్ మెంట్ స్థాయిలో 50 శాతం, నాన్ మెనేజ్ మెంట్ స్థాయిలో70 శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక జాబ్ కోటా బిల్లు రూపొందించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇతర నగరాలకు చెందిన యువతే కాకుండా, కంపెనీలు కూడా పెదవి విరుస్తున్నాయి. అయినప్పటికీ పరిశ్రమల్లో కన్నడిగుల ప్రయోజనాల కోసం బిల్లు రూపొందించామని పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తమ చర్యను సమర్థించుకున్నారు.


బిల్లుపై ఫోన్ పే కో ఫౌండర్

కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై ఫోన్ పే కో ఫౌండర్, సీఈవో సమీర్ నిగమ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ జాబ్ కోటా బిల్లు సరికాదు. ఆ బిల్లుతో ప్రైవేట్ విభాగంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు స్థానికులకు కేటాయించబడతాయి. తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉంటారు. అలాంటి వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం నా వయస్సు 46 సంవత్సరాలు. నేను ఒక రాష్ట్రంలో 15 ఏళ్లకు మించి కన్నా లేను. నా తండ్రి భారత నౌకాదళంలో పనిచేసేవారు. దేశంలో ప్రతి చోట పనిచేయాల్సి వచ్చేది. బిల్లు వల్ల ప్రైవేట్ విభాగంలో స్థానికేతరులకు ఉద్యోగాలు లభించడం కష్టం అవుతుంది అని’ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.


అర్హులు కారా..?

‘ప్రస్తుతం నేను కర్ణాటకలో ఉన్నాను. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. మరి నా పిల్లలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హులు కారా. దేశంలో చాలా మందికి నేను ఉద్యోగాలు కల్పిస్తున్నా. ఏడాదికి 25 వేల మందికి ఉపాధి అందిస్తున్నా. అయినప్పటికీ నా పిల్లలకు ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం పొందేందుకు అర్హత లేదా అని’ సమీర్ నిగమ్ కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


For
Latest News and National News click here

Updated Date - Jul 18 , 2024 | 09:54 PM