Share News

Nabanna rally: యుద్ధరంగంగా మారిన కోల్‌కతా రోడ్లు.. విద్యార్థులపై వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్

ABN , Publish Date - Aug 27 , 2024 | 02:51 PM

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' పేరుతో విద్యార్థులు మంగళవారంనాడు రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Nabanna rally: యుద్ధరంగంగా మారిన కోల్‌కతా రోడ్లు.. విద్యార్థులపై వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్

కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' (Nababba Abjijan) పేరుతో విద్యార్థులు మంగళవారంనాడు రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణలతో కోల్‌కతా రోడ్లు యుద్ధరంగంగా మారారు. హౌరా బ్రిడ్జి నుంచి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్ర సచివాలయం నబన్నా వరకూ విద్యార్థులు చేపట్టిన ర్యాలీని రోడ్లపైనే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుంటూ టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు.

Jharkhand: జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు తేదీ ఖరారు


కాగా, ర్యాలీలతో అశాంతిని రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. నిరసన ప్రదర్శన నేపథ్యలో కోల్‌కతా పోలీస్ జ్యురిష్‌డిక్షన్‌లో 25 మంది ఐపీఎస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర సెక్రటరీకి దారితీసే మార్గాల్లో 30 మంది ఐపీఎస్ అధికారులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసన ర్యాలీలు చట్టవిరుద్ధమంటూ జిల్లా యంత్రాగం ప్రకటించినప్పటికీ 'నబన్నా అభియాన్' ర్యాలీతో ముందుకు వెళ్లాలని పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ నిర్ణయించింది. రెండు ప్రధాన ర్యాలీలను ప్లాన్ చేసింది. సెంట్రల్ కోల్‌కటాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ఒక ర్యాలీ, హౌరాలోని సాంత్రగచ్చి నుంచి మరో ర్యాలీలి తలపెట్టింది. దీంతో హౌరాలో 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. నలుగురు ఏడీజీలు, 13 మంది డీఐజీలు, 15 మంది ఎస్పీ ర్యాంక్ అధికారులు పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు చేశారు. నాలుగు వాటర్ కేనన్ ట్రక్కులను కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచి పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలతో కోల్‌కతా, హౌరాలో వాహనాల రాకపోకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 03:11 PM