Share News

PM Modi Varanasi Vist: మోదీపై కంచి శంకరాచార్య ప్రశంసలు.. ఎన్డీయేకి కొత్త అర్ధం చెప్పిన స్వామీజీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 06:51 PM

వారణాసిలోని ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మనదేశం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, ఈ ప్రగతి వెనుక పటిష్టమైన నాయకత్వం ఉందని అన్నారు.

PM Modi Varanasi Vist: మోదీపై కంచి శంకరాచార్య ప్రశంసలు.. ఎన్డీయేకి కొత్త అర్ధం చెప్పిన స్వామీజీ

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంపై కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి (Shankar Vijayendra Sarasati Swami) ప్రశంసలు కురిపించారు. భగవంతుని ఆశీస్సుల వల్లే మోదీ వంటి మంచి నేతలు మన ముందుకు వచ్చారని, మోదీ ద్వారా భగవంతుడు ఎన్నో మంచి పనులు చేయిస్తారని కొనియాడారు. వారణాసిలోని ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మనదేశం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, ఈ ప్రగతి వెనుక పటిష్టమైన నాయకత్వం ఉందని అన్నారు. భగవంతుని ఆశీస్సులతోనే మోదీ వంటి మంచి నేతలు మనముందుకు వచ్చారని, మోదీ ద్వారా ఎన్నో మంచి పనులు చేయిస్తున్నారని అన్నారు.

Maharashtra Polls: 99 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా.. బరిలో ప్రముఖులు


ఎన్డీయే/నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్

ఎన్డీయే ప్రభుత్వ పాలనను ''నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్''గా విజయేంద్ర సరస్వతి స్వామి అభివర్ణించారు. ఇది..భద్రత, సౌఖ్యం, పౌరుల క్షేమంపై దృష్టిసారించిన మోడల్ గవర్నెన్స్ అని అన్నారు. సామాన్యుడు సహజంగా ఎదుర్కొనే సవాళ్ల గురించి మోదీకి మంచి అవగాహన ఉందని, ఆ సవాళ్లను తొలగించే దిశగా ఆయన పనిచేస్తున్నారని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజల పట్ల ఎంతో కనికరంతో పనిచేస్తోందని, ఇందుకు కోవిడ్ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఉదాహరణ అని అన్నారు. దేశంలోనే ఏ ఒక్క పౌరుడిని ఆకలితో నిద్రపోనీయలేదని, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో అందరికీ కడుపునింపిందని చెప్పారు. పాలన సాగించడంలో ప్రపంచానికే ఎన్డీయే ప్రభుత్వం 'రోల్ మోడల్'గా నిలిచిందని, సాంస్కృతిక పునరుజ్జీవనంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకు సోమ్‌నాథ్, కేదార్‌నాథ్‌లే ఉదాహరణలని చెప్పారు. కశ్మీర్‌లో ఇటీవల ఎన్నికల నిర్వహించడాన్ని కూడా స్వామీజీ ప్రశంసిస్తూ, ప్రధానమంత్రి మోదీతో తనకు చిరకాల పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు.


తొలుత సంస్కృతంలో స్వా్మి మాట్లాడుతూ, ఈరోజు నేత్ర ఉత్సవ్‌ను చూసే అవకాశం కలిగిందని, సేవకు సంబంధించిన కీలక సందర్భం ఇదని అన్నారు. ఇది కోయంబత్తురులో ప్రారంభమై, ఇప్పుడు 17వ ఆసుపత్రి మొదలైందని, యూపీలో రెండు ఆసుపత్రులు కాన్పూర్, వారణాసిలో ఉన్నాయని చెప్పారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Union Minister: మరోసారి నేనే సీఎం.. సిద్దూ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగదు

Updated Date - Oct 20 , 2024 | 06:52 PM