Share News

Kishan Reddy : నీట్‌ అకమ్రాలపై సుప్రీం జడ్జీతో విచారణ జరపాలి

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:32 AM

‘నీట్‌’ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని, కేంద్రం స్పందించేలా ఒత్తిడి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బహిరంగ లేఖ రాసింది.

Kishan Reddy : నీట్‌ అకమ్రాలపై సుప్రీం జడ్జీతో విచారణ జరపాలి

కిషన్‌రెడ్డికి విద్యార్థి, యువజన సంఘాల బహిరంగ లేఖ

‘నీట్‌’ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని, కేంద్రం స్పందించేలా ఒత్తిడి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బహిరంగ లేఖ రాసింది. నీట్‌ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ (ఎన్‌టీఏ) వ్యవరించిన తీరు కూడా పలు అనుమానాలకు తావిస్తోందని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున నీట్‌ ఫలితాలు విడుదల చేయడం, ఒకే సెంటర్‌లో 8 మందికి టాప్‌ ర్యాంక్లు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారని, వారికి నష్టం జరుగుతుందన్నారు. లేఖ రాసిన వారిలో ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఎఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్‌, వీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అరుణ్‌ కుమార్‌, పలు సంఘాల నేతలున్నారు.

Updated Date - Jun 21 , 2024 | 06:55 AM