Share News

NITI Aayog: రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం

ABN , Publish Date - Jul 27 , 2024 | 11:08 AM

రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌, సభ్యులు పాల్గొన్నారు.

NITI Aayog: రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌, సభ్యులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం పాల్గొన్నారు. వికసిత్‌ భారత్‌-2047 అజెండాగా నీతి ఆయోగ్ సమావేశం జరగుతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.


కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు, గ్రామీణ, పట్టణ ప్రజల జీవన నాణ్యతను పెంచడం, వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్రాల పాత్రపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. వికసిత భారత్ రోడ్ మాప్‌లో ఇప్పటికే ఈజ్ ఆఫ్ లివింగ్ లో భాగంగా తాగు నీరు, విద్యుత్,ఆరోగ్యం, పాఠశాల విద్య, భూమి ఆస్తి అంశాలపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అజెండా రూపొందించారు. సైబర్ సెక్యూరిటీ, జిల్లాల అభివృద్ధి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంశంపైనా నీతి ఆయోగ్ దృష్టి సారించింది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఏపీ సర్కార్ రూపకల్పన చేపట్టింది.


వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పనున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించినున్నారు. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలను చంద్రబాబు వివరించనున్నారు. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినున్నారు. డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో భేటీ అయిన విషయం తెలిసిందే. నీతి ఆయోగ్ సమావేశంలో భాగంగా బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిపినందుకు ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు.

ఇవి కూడా చదవండి..

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

జగన్‌ పత్రికకు జనం సొమ్ము

Read more National News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 11:10 AM