Share News

Parliament: రేపు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం.. అస్త్రశస్త్రాలతో సిద్ధమౌతున్న అధికార, విపక్షాలు

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:34 PM

కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్‌‌కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

Parliament: రేపు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం.. అస్త్రశస్త్రాలతో సిద్ధమౌతున్న అధికార, విపక్షాలు

ఢిల్లీ: కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్‌‌కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

సభ ప్రారంభం కాగానే తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభిస్తారు.ఆ తర్వాత మరోసభ్యుడు బన్సూరి స్వరాజ్ తీర్మానాన్ని బలపరుస్తారు. రాజ్యసభలో ఇదే అంశంపై చర్చకు 21 గంటలు కేటాయించారు. లోక్‌సభలో చర్చకు 16 గంటల సమయం కేటాయించగా, మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తారు.


ఇదిలా ఉండగా నీట్ పేపర్ లీకేజీలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మే 5న NTA నిర్వహించిన NEET-UG పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు జూన్ 4న ప్రకటించారు. అయితే ఈ పరీక్షల్లో 60కిపైగా అభ్యర్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో పేపర్ లీకేజ్ జరిగిందని అనుమానాలు వెలువడ్డాయి.


బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ జరిగినట్లు నిర్ధారణ అయింది. నీట్ అంశంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా సభలో చర్చ జరగాల్సి ఉంది. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పిలుపునివ్వడంతో రాజ్యసభలో కూడా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తోటి సభ్యులతో కలిసి వెల్‌ ఆఫ్‌ హౌస్‌లో నిరసన తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ రాజ్యసభలో నినాదాలు చేస్తూ స్పృహతప్పి పడిపోయారు. ఆమెను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 30 , 2024 | 05:34 PM