Share News

PM Modi: భూటాన్ పర్యటనకు ప్రధాని మోదీ.. ఆ ఆంశాలపైనే ప్రధాన చర్చ..

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:35 AM

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) భూటాన్‌ వెళ్లారు. గురువారమే పీఎం మోదీ భూటాన్ వెళ్లాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది.

PM Modi: భూటాన్ పర్యటనకు ప్రధాని మోదీ.. ఆ ఆంశాలపైనే ప్రధాన చర్చ..

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) భూటాన్‌ వెళ్లారు. గురువారమే పీఎం మోదీ భూటాన్ వెళ్లాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. పారో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ( PM Modi ) భూటాన్‌ ప్రధాని షెరింగ్ టోబ్గే స్వాగతం పలికారు. భారత్-భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో తాను ఈ పర్యటనకు వెళ్తున్నట్లు మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. భూటాన్ రాజు మెజెస్టి, ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గేతో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

భారత్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్లకు ముందు భూటాన్ పర్యటనను ప్రధాని మోదీ తన చివరి విదేశీ పర్యటనగా భావిస్తున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల ప్రజల ప్రయోజనం కోసం అనుకూలమైన భాగస్వామ్యాన్ని అందించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..!


కాగా.. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే మార్చి 14-18 మధ్య భారత్ ను సందర్శించారు. జనవరిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత టోబ్గే మొదటి విదేశీ పర్యటన ఇండియానే కావడం విశేషం. భారత్, భూటాన్‌ల మధ్య ఉన్న స్నేహ బంధాలు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయని ప్రధాని మోదీ, టోబ్గే ఓ పేర్కొన్నారు. భూటాన్ చివరి పంచవర్ష ప్రణాళిక కోసం భారత్ రూ. 5,000 కోట్ల అభివృద్ధి చేసింది.

Hemant Soren: మనీ లాండరింగ్ కేసు.. మాజీ సీఎం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 10:41 AM