Share News

Rahul Gandhi: అదానీ ప్రయోజనాల కోసమే బీజేపీ 'ఏక్ హై తో సేఫ్ హై' నినాదం

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:41 PM

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తన వాదనకు బలం చేకూర్చే రెండు పోస్టర్లను ఆయన ప్రదర్శించారు.

Rahul Gandhi: అదానీ ప్రయోజనాల కోసమే బీజేపీ 'ఏక్ హై తో సేఫ్ హై' నినాదం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఏక్ హై తో సేఫ్ హై' నినాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు ఎక్కుపెట్టారు. మహారాష్ట్ర ప్రయోజనాల కంటే బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని అన్నారు. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తన వాదనకు బలం చేకూర్చే రెండు పోస్టర్లను ఆయన ప్రదర్శించారు.

Raghuvinder Shokeen: గెహ్లాట్ ఔట్..రఘువీందర్ ఇన్


మొదటి ఫోటోలో ప్రధాని మోదీ, అదానీ ఉన్నారు. దానిపై 'ఏక్ హై తో సేఫ్ హై' అనే క్యాప్షన్ ఉంది. ఒకరితో ఒకరు కలిసి ఉన్నంత వరకూ వారిద్దరూ సేఫ్‌గా ఉంటారని రాహుల్ ఈ ఫోటోపై వ్యాఖ్యానించారు. రెండో ఫోటోలో అదానీ గ్రూప్ వివాదాస్పద థారవి రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించినది. సురక్షితంగా(సేఫ్) ఉండటం అంటే ముంబై సంపదకు సంబంధించిన విషయమని, బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం మద్దతుతో ఆ సంపదను అదానీ టార్గెట్ చేసుకున్నారని ఆరోపించారు. రాజకీయ యంత్రాగం యావత్తు ధారవి రీడవలప్‌మెంట్ ప్రాజెక్టును ఒకే వ్యక్తికి (అదానీ) కట్టబెట్టాలనుకుంటోందని అన్నారు. థారవి రీడవలప్‌మెంట్ ప్రాజెక్టు అసంబద్ధమైన రీతిలో ఒక వ్యక్తికే ప్రయోజనం చేకూర్చిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమని, టెండర్ల విధానంతో తాము ఏకీభవించడం లేదని, దేశంలోని అన్ని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, దేశ సంపద ఒకే వ్యక్తికి కట్టబెడుతున్నారని రాహుల్ విమర్శించారు.


టెండర్ రద్దు హామీకి కట్టుబడి ఉంటాం..

'మహా వికాస్ అఘాడి' కూటమి అధికారంలోకి రాగానే థారవి ప్రాజెక్టు టెండర్‌ను రద్దు చేస్తామంటూ ఉద్ధవ్ థాకరే చేసిన వాగ్దానానికి తాము కట్టుబడి ఉంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి కీలక పారిశ్రామిక ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించుకుపోయారని కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక అవకాశాలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గండికొట్టారని అన్నారు. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ వంటి రూ.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించారని, మహారాష్ట్రకు రావాల్సిన 5 లక్షల ఉద్యోగాలను కోల్పోయేలా చేశారని రాహుల్ ఘాటుగా విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు సిద్ధాంతాలకు సంబంధించిన పోరాటమని, ఒక బిలియనీర్‌కు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటమని రాహుల్ అన్నారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే కాంగ్రెస్ సారథ్యంలోని సారథ్యంలోని ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.


ఏమిటీ థారవీ ప్రాజెక్టు

సెంట్రల్ ముంబైలోని 600 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌కు సంబంధించిన ప్రాజెక్టు ఈ థారవి డవలప్‌మెంట్ ప్రాజెక్టు. మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకాంశంగా కూడా ఉంది. బీజేపీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం హయాంలో 2022లో ఈ రీడవలప్‌మెంట్ బిడ్‌ను అదానీ గ్రూప్ దక్కించుకుంది. అయితే కాంట్రాక్టు కేటాయింపులో పారదర్శకత లోపించిందంటూ విపక్షాలు ఈ నిర్ణయంపై ఆందోళన వక్తం చేశాయి. కాగా, స్లమ్ ప్రాంత వాసుల జీవన స్థితగతులు, మౌలిక వసతుల కల్పనకు దోహదపడే పడే ప్రాజెక్టు ఇదని బీజేపీ సమర్ధిస్తోంది.


ఇవి కూడా చదవండి...

Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..

New Delhi: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. పెన్షన్ రూల్‌లో మార్పు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 18 , 2024 | 04:41 PM