Share News

Rahul Gandhi: స్మృతి ఇరానీ విషయంలో ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:50 PM

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హుందాతనాన్ని ప్రదర్శించారు. తన పట్ల తీవ్ర విమర్శలు గుప్పించే బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పట్ల అవమానకరమైన పదాలు ఉపయోగించవద్దంటూ కాంగ్రెస్ శ్రేణులను కోరారు.

Rahul Gandhi: స్మృతి ఇరానీ విషయంలో ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హుందాతనాన్ని ప్రదర్శించారు. తన పట్ల తీవ్ర విమర్శలు గుప్పించే బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పట్ల అవమానకరమైన పదాలు ఉపయోగించవద్దంటూ కాంగ్రెస్ శ్రేణులను కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

‘‘రాజకీయ జీవితంలో గెలుపు, ఓటములు సహజం. ఆమె పట్ల అవమానకరమైన భాష, అసభ్యకరమైన పదాలు ఉపయోగించడాన్ని మానుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. వ్యక్తులను అవమానపరచడం, అభాసుపాలు చేయడం బలహీనతకు సంకేతం. బలం కాదని తెలుసుకోవాలి’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ స్పందించిన తీరుపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హూందాతనాన్ని చూపించారని వ్యాఖ్యానిస్తు్న్నారు.


అమేథీ నియోజకవర్గ అభివృద్ధిని రాహుల్ గాంధీ పట్టించుకోరంటూ స్మృతి ఇరానీ ఎన్నోసార్లు విమర్శించారు. రాహుల్‌ని హేళన చేస్తూ మాట్లాడిన పలు సందర్భాలు కూడా ఉన్నాయి. గాంధీ కుటుంబం, ముఖ్యంగా రాహుల్ గాంధీ అమేథీ ప్రజలు పేదలుగా ఉండాలని కోరుకుంటున్నారని ఆరోపణలు కూడా చేశారు.


2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫలితం రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న కిషోరీ లాల్ శర్మ చేతిలో స్మృతి ఇరానీ ఏకంగా 1,67,196 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ నియోజకవర్గాల నుంచి బంపర్ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో ఇరానీ ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి

ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం

ఘోరం.. 24 గంటల్లో 25 మంది మృతి.. కారణమదే

For more National News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 05:09 PM