Share News

Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

ABN , Publish Date - Jan 22 , 2024 | 10:27 AM

‘రామాయణం’ హిందీ సీరియల్‌లో నటించిన నటీనటులు అయోధ్యలో కనిపించారు . 1987-88లో రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఆ సీరియల్ అప్పట్లో విశేష జనాధరణ పొందింది.

 Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

అయోధ్య: అయోధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామనామ స్మరణతో అయోధ్య పుర వీధులు మారుమోగుతున్నాయి. బాలరాముడి (Ram Lalla) ప్రతిష్ఠాపన కోసం ప్రముఖులు విచ్చేశారు. ‘రామాయణం’ హిందీ సీరియల్‌లో నటించిన నటీనటులు కనిపించారు . బాలరాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 1987-88లో రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఆ సీరియల్ అప్పట్లో విశేష జనాధరణ పొందింది. సాయంత్రం అయ్యిందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు.

రాముడిగా అరుణ్

రామాయణం సీరియల్‌లో శ్రీరాముడిగా అరుణ్ నటించి మెప్పించారు. మెయిన్ లీడ్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. సీతాదేవిగా దీపిక చికాలియా ఇంప్రెస్ చేశారు. లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ సొంత తమ్ముడిలా కనిపించారు. హనుమంతుడిగా దివంగత దారా సింగ్, రావణుడిగా అర్వింద్ త్రివేది పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. రామాయణం ఇతివృత్తంతో తీసిన సీరియల్‌‌ను కోట్లాది మంది వీక్షించారు. సీరియల్‌లో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వారు ఇప్పుడు అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చక్కర్లు కొడుతున్నాయి. రాములోరి సేవలో నటులు పాల్గొన్నారని కామెంట్స్ చేస్తున్నారు,

రీల్ రాముడు

శ్రీరాముడు ఉత్తమ పాలకుడిగా పేరు గడించారు. ఆదర్శ పురుషుడిగా చరిత్రలో నిలిచారు. శ్రీరాముడు ఆదర్శాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు రామాయణం సీరియల్‌ని నిర్మించి దూరదర్శన్‌లో టెలికాస్ట్ చేశారు. రామాయణం సీరియల్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. తర్వాత సీరియల్‌ను మరోసారి టెలికాస్ట్ చేశారు. ఖండంతరాలు దాటి రామాయణం సీరియల్ స్ట్రీమింగ్ అయ్యింది. ఆ సమయంలో రాముడు ఎలా ఉన్నారంటే అరుణ్‌ను ఊహించుకున్నారు. ఆ సీరియల్ జనాలను అంతగా ఆకట్టుకుంది.

రీ టెలికాస్ట్

రామాయణం సీరియల్‌‌ను అలోక్ కుమార్ రచించారు. రవీంద్ర జైన్ సంగీతం అందజేశారు. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించారు. రామాయణ సీరియల్ మరోసారి రీ టెలికాస్ట్ చేశారు. 5 ఖండాల్లో 17 దేశాల్లో 20 చానెళ్లలో ప్రసారం చేశారు. రామాయణం సీరియల్‌ను 650 మిలియన్ల మంది చూశారని బీబీసీ తెలిపింది. సిరీస్‌లో గల ప్రతీ ఎపిసోడ్ ద్వారా దూరదర్శన్‌కు రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 10:46 AM