Share News

Kanwar Yatra: 'నేమ్‌పేట్ల' అంశంపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు

ABN , Publish Date - Jul 26 , 2024 | 06:19 PM

శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.

Kanwar Yatra: 'నేమ్‌పేట్ల' అంశంపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు

న్యూఢిల్లీ: శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర (Kanwar Yatra) మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.


ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన నేమ్‌ప్లేట్ల ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జూలై 22న విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 'మధ్యంతర స్టే'కు అదేశాలిచ్చింది. పేర్లను బహిర్గతం చేయమని ఎవరినీ బలవంతం చేయలేమని పేర్కొంది. దీనిపై యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తమ స్పందన తెలియచేయాలని ఆదేశించింది. తాజాగా జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర స్టేను పొడిగించింది.


''మా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. పేర్లను బహిర్గతం చేయమని ఎవరినీ బలవంతం చేయలేం. ఎవరైనా స్వచ్ఛందంగా పేర్లు రాసేందుకు ముందుకు వస్తే వారిని అడ్డుకోం. అయితే ఎవరినీ పేర్లు రాయమని బలవంతం చేయకూడదు. ఆ ఉద్దేశంతోనే మేము స్టే ఇచ్చాం'' అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసే ప్రత్యుత్తరాలపై తమ స్పందనలు నివేదించేందుకు పిటిషన్లర్లను అనుమతిస్తున్నారని పేర్కొంటూ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. కాగా, నేమ్‌పేట్ల ఆదేశాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ అఫిడివిట్‌లో సమర్ధించుకుంది. కన్వర్ యాత్ర శాంతియుతంగా పూర్తయ్యేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చింది.

Updated Date - Jul 26 , 2024 | 06:24 PM