Delhi Rains: దంచికొట్టిన వాన.. వర్షపునీటితో నిండిన అండర్ పాస్
ABN , Publish Date - Aug 20 , 2024 | 04:23 PM
భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలతో వరదనీరు పోటెత్తుతోంది. చిన్న చిన్న గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. అండర్ పాస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ మింటో బ్రిడ్జీ అండర్ పాస్ నీటితో నిండిపోయింది. ఫొటో, వీడియాల్లో వరదనీరు స్పష్టంగా కనిపిస్తోంది.
ఢిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు (Delhi People) భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలతో వరదనీరు పోటెత్తుతోంది. చిన్న చిన్న గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. అండర్ పాస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ మింటో బ్రిడ్జీ అండర్ పాస్ నీటితో నిండిపోయింది. ఫొటో, వీడియాల్లో వరదనీరు స్పష్టంగా కనిపిస్తోంది. అండర్ పాస్ నుంచి వెళ్లే సమయంలో ఒక్కసారిగా వరదనీటి ప్రవాహం పెరిగింది. ఆ సమయంలో వస్తోన్న బస్సు నీటిలో చిక్కుకొని ఉంది.
చిక్కిన స్కూల్ బస్సు
అండర్ పాస్‌లో స్కూల్ బస్సు, ఆటో చిక్కుకుంది. ఘటన గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అండర్ పాస్‌లో ఉన్న నీటిని పంప్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా మిండో బ్రిడ్జి అండర్ పాస్ వద్ద వర్షపునీరు భారీగా చేరింది. 2020 జూలైలో మినీ ట్రక్కు అందులో చిక్కుకుంది. ఒకతను వరదనీటిలో కొట్టుకొని పోయిన సంగతి తెలిసిందే.
దంచికొట్టిన వాన..
మంగళవారం ఉదయం నుంచే ఢిల్లీలో వర్షం దంచికొట్టింది. రిడ్జి బ్రిడ్జి వద్ద 72.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ ప్రకటన చేసింది. సఫ్తార్ జంగ్ వద్ద 28.7 మిల్లీ మీటర్లు, లోధి రోడ్డులో 25.6 మిల్లీ మీటర్లు, ఆయానగర్ వద్ద 2.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్‌లో నిన్న (సోమవారం) మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఓ గంటపాటు కుంభవృష్టి వర్షం పడింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వరదనీరు లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయే వరకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాత్రి వరకు చిరుజల్లులు కురిశాయి. మంగళవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 9 గంటల నుంచి వర్షం తగ్గింది. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం ఉందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News