Somanathan: క్యాబినెట్ కొత్త సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ టీవీ సోమనాథన్
ABN , Publish Date - Aug 10 , 2024 | 06:23 PM
నరేంద్ర మోదీ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ డాక్టర్ టీవీ సోమనాథన్‌ను(TV Somanathan) క్యాబినెట్ కొత్త సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆయన భారత ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.
నరేంద్ర మోదీ(modi) ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ డాక్టర్ టీవీ సోమనాథన్‌ను(TV Somanathan) క్యాబినెట్ కొత్త సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆయన భారత ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు. డాక్టర్ సోమనాథన్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి. దేశంలోని పలు శాఖల్లో సోమనాథన్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 2015 నుంచి ఆగస్టు 2017 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా పనిచేశారు. లాక్‌డౌన్ సమయంలో టీవీ సోమనాథన్ కీలక పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి:
Police Seizes: పోలీసులకు చిక్కిన బంగారాన్ని మించిన పదార్థం.. 50 గ్రాములకే రూ.850 కోట్లు
సోమనాథన్‌కు పరిపాలనా సేవలలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నో ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో చేరడానికి ముందు ఆయన ప్రధాన మంత్రి కార్యాలయంలో (PMO) ఉన్నారు. ఇది కాకుండా ఆయన బడ్జెట్ మేకింగ్ టీమ్‌లో కూడా పాల్గొన్నారు. అయితే రాజీవ్ గౌబా 2019 నుంచి క్యాబినెట్ సెక్రటరీ పదవిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజీవ్ గౌబాకు పొడిగింపు లభించకపోవడంతో సీనియర్ IAS TV సోమనాథన్ క్యాబినెట్ సెక్రటరీగా రెండేళ్ల పదవి కాలానికి ఎంపికయ్యారు.
ఇవి కూడా చదవండి:
Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More National News and Latest Telugu News