SIT Officials : మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చార్జ్‌షీట్
ABN , Publish Date - Aug 24 , 2024 | 04:38 AM
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
బెంగళూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై హొళెనరసీపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు అధికారి సుమారాణి 137 మంది సాక్షులను విచారించారు.
ఆ వివరాలతో 2,144 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రజ్వల్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.