Home » JDS
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందనే సీఎం సిద్ద రామయ్య(CM Siddaramaiah) ఆరోపణలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి(Union Minister Pralhad Joshi) తిప్పికొట్టారు. హుబ్బళ్ళిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది సిద్దరామయ్య అన్నారు.
జేడీఎస్ నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
‘మరోసారి నేను ముఖ్యమంత్రి’ అవుతా.. జేడీఎస్ మనుగడకు ఎవ్వరి మద్దతు అవస రం లేదు.. అని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) ధీమా వ్యక్తం చేశారు.
డీ నోటిఫికేషన్ వివాదంలో లోకాయుక్త విచారణకు కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) హాజరయ్యారు. గంగేనహళ్ళి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి లోకాయుక్త పోలీసులు కుమారస్వామికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన కుమారస్వామి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా లోకాయుక్త కార్యాలయానికి వెళ్లారు.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాల్లో కీలకంగా మారిన జేడీయూ కూడా ఎర్ర జెండా చూపింది.
ఆదివారం బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలతోపాటు కార్యకర్తలు సైతం పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా జరగాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపు 'కుంభకోణం'పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) శుక్రవారం తమ నిరసన ప్రదర్శనను కొనసాగించాయి.
ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.
‘నా ఆస్తులు బహిరంగం చేస్తా... కుమారస్వామి సోదరుడు బాలకృష్ణ గౌడ ఆస్తులు చెప్పాలి’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) సవాల్ విసిరారు. సోమవారం మద్దూరులో కాంగ్రెస్ ప్రజాందోళన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) తనను ప్రశ్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేహక్కు అందరికీ ఉందని అన్నారు.