Share News

Muda Scam: ముడా స్కాంపై బీజేపీ-జేడీఎస్ నిరసన.. సీఎం కౌంటర్

ABN , Publish Date - Aug 09 , 2024 | 09:31 PM

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపు 'కుంభకోణం'పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) శుక్రవారం తమ నిరసన ప్రదర్శనను కొనసాగించాయి.

Muda Scam: ముడా స్కాంపై బీజేపీ-జేడీఎస్ నిరసన.. సీఎం కౌంటర్
Muda scam protest

కర్ణాటక(karnataka)లోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపు 'కుంభకోణం'పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) శుక్రవారం తమ నిరసన ప్రదర్శనను కొనసాగించాయి. సిద్ధరామయ్య సతీమణి పార్వతితో సహా భూములు కోల్పోయిన వారికి ముడా ద్వారా స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా బెంగళూరు-మైసూర్ పాదయాత్ర కొనసాగుతోంది.

నినాదాలు

ఈరోజు పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీల నాయకులు పాల్గొని సిద్ధరామయ్యకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో రేపు 'మైసూరు చలో' నిరసన కవాతు ఏడో రోజు మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం నుంచి ప్రారంభమై 10 కిలోమీటర్ల మేర జరగనుంది. శనివారం మైసూరు చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా బీజేపీ-జేడీ(ఎస్) తమ నిరసన యాత్రను ముగించేందుకు సిద్ధమైంది.


ప్రశ్నించే హక్కు లేదు

ఈ క్రమంలోనే మహారాజా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాఉద్యమ సదస్సులో విపక్షాల ఆరోపణలు, పాదయాత్రలపై స్పందిస్తూ బ్రిటీష్‌వారిని భారత్‌ నుంచి తరిమికొట్టేందుకు ఆగస్టు 9న చారిత్రాత్మకమైన క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైందని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఈ క్రమంలో వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న ప్రజలను సహించలేని మనువాడీలను, కులవాదులను, భూస్వామ్య ప్రజలను మనం వ్యతిరేకించాలి, ఖండించాలన్నారు. బీజేపీ, జేడీ(ఎస్‌) నేతలు కుంభకోణాలకు పాల్పడ్డారని, తనను ప్రశ్నించే నైతిక హక్కు వారికి లేదని సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌. యడియూరప్ప, ఆయన కుమారుడు బి.వై.విజయేంద్ర, కుమారస్వామిలకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసే నైతిక హక్కు ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

No Good Morning: స్కూళ్లలో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని చెప్పాలి.. కీలక ఆదేశాలు


ఆ భూమికి బదులుగా

ముడా 'స్కామ్'లో సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని ఓ ప్రాంతంలో పరిహారం సైట్ కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. MUDA తన 3.16 ఎకరాల భూమికి బదులుగా పార్వతికి 50:50 నిష్పత్తిలో ప్లాట్లను కేటాయించిందని తెలుస్తోంది. దీంతో MUDA వివాదాస్పదంగా మారింది. రెసిడెన్షియల్ లేఅవుట్‌లను రూపొందించేందుకు వారి నుంచి సేకరించిన అభివృద్ధి చెందని భూమికి బదులుగా అభివృద్ధి చెందిన భూమిలో 50 శాతం భూమిని వారికి కేటాయించిందని అంటున్నారు. ఈ క్రమంలో ముడా స్కాం రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు చేరిందని బీజేపీ నేతలు అంటున్నారు.


సీఎంకు నోటీస్

న్యాయవాది, కార్యకర్త టీజే అబ్రహం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ జూలై 26న సీఎంకు "షోకాజ్ నోటీసు" జారీ చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై మీ స్పందనను ఏడు రోజుల్లోగా దాఖలు చేయాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు. కర్నాటక ప్రభుత్వం ఆగస్టు 1న ముఖ్యమంత్రికి "షోకాజ్ నోటీసు" ఉపసంహరించుకోవాలని గవర్నర్‌కు "గట్టిగా సలహా" ఇచ్చింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దారుణంగా దుర్వినియోగం చేశారని ఆరోపించింది. రాజకీయ కారణాలతో కర్ణాటకలో చట్టబద్ధంగా ఎన్నికైన మెజారిటీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోందని మంత్రి మండలి సమావేశం అనంతరం పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 09:34 PM