Share News

MUDA Scam: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

ABN , Publish Date - Aug 18 , 2024 | 08:09 PM

ఆదివారం బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలతోపాటు కార్యకర్తలు సైతం పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా జరగాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

MUDA Scam: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

బెంగళూరు, ఆగస్ట్ 18: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరాయమ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గ్లహోత్ అనుమతి ఇవ్వడంపై అధికార కాంగ్రెస్ పార్టీ మండిపడ్డింది. ఆ క్రమంలో రేపు.. అంటే ఆగస్ట్ 19వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని శ్రేణులకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.

Also Read: TMC MP: వివాదంలో చిక్కుకున్న సినీ నటి రచనా

డిప్యూటీ సీఎం డీకే కీలక నిర్ణయం..

ఆదివారం బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలతోపాటు కార్యకర్తలు సైతం పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా జరగాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదన్నారు.

Also Read: Jammu Kashmir Assembly Elections: పొత్తుల్లేవు.. ఒంటరిగానే బరిలోకి.. కానీ..

Also Read: Mohanlal: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్‌లాల్


పార్టీ శ్రేణులకు జాగ్రత్తలు చెప్పిన డిప్యూటీ సీఎం ..

కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఈ ఆందోళనల్లో సంఘ విద్రోహక శక్తులు చొరబడే అవకాశముందని ఈ సందర్భంగా డిప్యూటీ డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా ఈ ఆందోళనల్లో హింసాకు దారి తీసే పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలు చాలా జాగ్రత్తగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్బంగా ఆయన సూచించారు.

Also Read: వైఎస్ భారతి కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?


రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రాలు...

సీఎం సిద్దరామయ్యను విచారించాలంటూ గవర్నర్ గేహ్లత్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రాలు పంపాలన్నారు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, తాలుకా కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు అందుకు సంబంధించిన వినతి పత్రాలు అందజేయాలని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచించారు.

Also Read: శ్రీవారి ఆలయ ఫైల్స్ కే రక్షణ లేకపోతే ఎలా?


సీఎం కూర్చి దింపేందుకు కుట్ర..

సీఎం సిద్దరామయ్యను పదవి నుంచి దిప్పేందుకు జరుగుతున్న ఈ కుట్రకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని డీ కే శివకుమార్ స్పష్టం చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతికరంగా భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీ(ఎస్)లు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సిద్దరామయ్యను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ, జేడీ(ఎస్)తో పాటు కర్ణాటకలోని స్థానిక నేతలు ఒక తాటికిపైకి వచ్చి కుట్రకు తెర తీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు.

Also Read: Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 08:09 PM