Share News

Delhi Coaching Center Tragedy: ఏసీ రూమ్‌ల నుంచి ట్వీట్లు కాదు.. బాధ్యత తీసుకునేదెవరు.. విద్యార్థుల ఆగ్రహం..

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:24 AM

ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్‌మెంట్‌లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఢిల్లీలో నిరసన కొనసాగుతూనే ఉంది. ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Delhi Coaching Center Tragedy: ఏసీ రూమ్‌ల నుంచి ట్వీట్లు కాదు.. బాధ్యత తీసుకునేదెవరు.. విద్యార్థుల ఆగ్రహం..
Delhi Coaching Center Tragedy

ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్‌మెంట్‌లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఢిల్లీలో నిరసన కొనసాగుతూనే ఉంది. ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఒక అబ్బాయి ఉన్నారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థులను శ్రేయ, తాన్య, నెవిన్‌లుగా గుర్తించారు.

Rahul Gandhi: చెప్పులు కుట్టే వ్యక్తికి రాహుల్ ఊహించని సాయం..


విచారణకు ఆదేశం..

ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి అతిషి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించడంపై నిరసనలె పాల్గొన్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ఈ సంఘటనకు ఎవరూ బాధ్యత వహించరన్నారు. ప్రభుత్వం నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులందరికీ బాధ్యత వహించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏసీ గదుల్లోంచి ట్వీట్లు చేయడం లేదా లేఖలు రాయడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులకు

వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లకు సంబంధించిన గ్రంథాలయాలు 80 శాతం గ్రంథాలయాలు బేస్‌మెంట్‌లోనే ఉంటాయని.. వర్షం కురిసిన 10 నిమిషాలకే ఈ ప్రదేశం నీటితో నిండిపోతుందని.. దీనిపై ఎంసీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు.

Delhi : హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మొగ్గు


ఆప్ బాధ్యత వహించాలి..

ఢిల్లీలో కోచింగ్ సెంటర్‌లో వరద నీరు చేరి విద్యార్థులు మృతి చెందిన ఘటనకు ఆప్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ డిమాండ్ చేశారు. తమ భవిష్యత్తు కలలను సాకారం చేసుకునేందుకు విద్యార్థులు ఇక్కడికి వచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల సంరక్షణను గాలికొదిలేసి.. నిబంధనలకు విరుద్దుంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిందన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని డ్రెయిన్‌ను శుభ్రం చేయాలని ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌కు ఎన్నోసార్లు విన్నవించినా ఉపయోగంలేదని స్థానికులు చెబుతున్నారని ఎంపీ తెలిపారు. డ్రెయిన్ మొత్తం బురద నీతితో నిండిపోవడంతోనే వర్షం కురిసిన వెంటనే ఆ ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోతుందన్నారు. విద్యార్థుల మరణాలకు కేజ్రీవాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Delhi : ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద


రాజకీయాలు వద్దు..

ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన ఘటనపై స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ స్పందించారు. ఇది లో లైన్ ఏరియా అని అన్నారు. గత పాలకులు ఏమి చేశారో చెప్పాలన్నారు. ఒక్క ఏడాదిలో డ్రెయిన్లు నిర్మించలేమని.. ఈ ఘటనపై రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమన్నారు.


Chennai : తమిళనాట బడ్జెట్‌ సెగలు.. డీఎంకే ధర్నా

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 09:24 AM