Share News

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు?

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:15 PM

Sukanya Samriddhi Yojana Updates: భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో కొన్ని పథకాలు మహిళల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. బేటీ బచావో బేటి పఢావో పథకం కింద భారత ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ను ప్రారంభించింది.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు?
Sukanya Samridhi Yojana

Sukanya Samriddhi Yojana Updates: భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో కొన్ని పథకాలు మహిళల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. బేటీ బచావో బేటి పఢావో పథకం కింద భారత ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ను ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రూపొందించిన పథకం. ఈ పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ కుమార్తెల ఉన్నత విద్య కోసం, వివాహం కోసం డబ్బును డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంపై భారీగా వడ్డీని అందిస్తోంది.


2015 నుంచి అనేక మార్పులు, చేర్పులతో కొనసాగుతూ వస్తోన్న ఈ పథకంలో ఇప్పుడు మరో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఈ నిబంధనలు కూడా వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తాయని సమాచారం. మరి ఇంతకీ ఆ కొత్త నిబంధనలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.


ఇక నుంచి వారు మాత్రమే అకౌంట్ తెరవొచ్చు..

సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా కుమార్తెల కోసం అకౌంట్ ఓపెన్ చేయాలంటే వారి తల్లిదండ్రులు గానీ, సంరక్షకులు గానీ అవసరం. తల్లిదండ్రులు కుమార్తెకు చట్టపరమైన సంరక్షకులు. కానీ, కూతురికి చట్టపరమైన సంరక్షకులు లేకుంటే.. ఇతర సంరక్షకులు ఆమె పేరిట ఖాతా తెరిచే అవకాశం ఇంతకాలం ఉంది. కానీ, ఇప్పటి నుంచి అలా కుదరదు. బాలిక పేరిట ఉన్న ఖాతాను చట్టపరమైన సంరక్షకుడి పేరిట బదిలీ చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు ఖాతాలను మూసివేయడం జరుగుతుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.


పథకం వల్ల ప్రయోజనం ఏమిటి?

ఆడపిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఖాతా తెరవడం ద్వారా కూతురి పేరిట మంచి మొత్తాన్ని జమ చేయవచ్చు. ఈ మొత్తం అమౌంట్.. భవిష్యత్‌లో కుమార్తె విద్యకు గానీ.. ఆమె వివాహానికి గానీ ఉపయోగపడుతుంది. అయితే, ఈ పథకం కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తె పేరిట ఖాతాను తెరవవచ్చు.

రూ.250 చెల్లించి ఎవరైనా ఈ పథకం కింద ఖాతా తెరవవచ్చు. పథకంలో ఏటా కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత 21 సంవత్సరాల వరకు వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది.


ఖాతా తెరవడం ఎలా?

సుకన్య యోజన కింద ఖాతా తెరవడానికి.. సమీపంలోని ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లవచ్చు. ఈ పథకం కోసం అవసరమైన డాక్యూమెంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌వై ఖాతాను తెరవడానికి కుమార్తె వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఈ పథకం కింద ఇద్దరు బాలికల ఖాతాలను తెరవవచ్చు. అయితే మొదటి ఇద్దరు అమ్మాయిలు కవలలైతే ముగ్గురు అమ్మాయిలకు ఖాతాలు తెరవవచ్చు.


Also Read:

తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా

మాయాజాలం కోసం వేచిచూడండి

ప్రతి 13 మందిలో ఒకరికి నడుము నొప్పి

For More National News and Telugu News..

Updated Date - Sep 10 , 2024 | 12:15 PM