Share News

Supreme Court : ఖైదీల విడుదలకు లాయర్ల తప్పుడు సమాచారం

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:09 AM

జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Supreme Court : ఖైదీల విడుదలకు లాయర్ల తప్పుడు సమాచారం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టులోనూ తప్పుడు వివరాలే చెబుతున్నారని పేర్కొంది. ఇది తమ నమ్మకాన్ని సడలింపజేస్తోందని వ్యాఖ్యానించింది. గత మూడు వారాల్లో తప్పుడు వివరాలు ఉన్న ఆరేడు పిటిషన్లు తమ పరిశీలనకు వచ్చాయని చెప్పిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. ప్రతి రోజూ ప్రతి ధర్మాసనమూ 60-80 చిన్నచిన్న కేసులపై విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. అన్ని సార్లు పేజీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉండకపోవచ్చని తెలిపింది. కొన్నిసార్లు న్యాయవాదుల మీద ఉన్న నమ్మకం ఆధారంగా విచారణ జరుపుతామని చెప్పింది.

Updated Date - Sep 16 , 2024 | 05:09 AM