Share News

Supreme Court : అభిషేక్‌కు బెయిల్‌

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:25 AM

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితుడు అభిషేక్‌ బోయినపల్లికి సుప్రీంకోర్టు సోమవారం సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది.

Supreme Court : అభిషేక్‌కు బెయిల్‌

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితుడు అభిషేక్‌ బోయినపల్లికి సుప్రీంకోర్టు సోమవారం సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అభిషేక్‌ను 2022లో అరెస్టు చేసి తిహాడ్‌ జైలుకు పంపించింది. అయితే, తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని అభిషేక్‌ సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

ఆ బెయిల్‌ను పొడిగిస్తూ వచ్చింది. అభిషేక్‌ సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌ అరవింద్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితులందరూ బెయిల్‌పై బయటే ఉన్నారని అభిషేక్‌ తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అభిషేక్‌కు కూడా సాధారణ బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఈడీ వాదనలు వినిపించాలని కోరగా.. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు ఎటువంటి అభ్యతరం తెలపలేదు. దీంతో కోర్టు అభిషేక్‌కు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - Oct 15 , 2024 | 03:25 AM