Share News

Tamilisai: మాజీ గవర్నర్‌ తమిళిసైకి జాతీయ స్థాయి పదవి?

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:53 AM

బీజేపీ అధిష్ఠానం ఆదేశాలను శిరసావహించి రెండు రాష్ట్రాల గవర్నర్‌ పదవిని వదలుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Former Governor Dr. Tamilisai Soundararajan)కు జాతీయ స్థాయి పదవి వరించనుంది.

Tamilisai: మాజీ గవర్నర్‌ తమిళిసైకి జాతీయ స్థాయి పదవి?

చెన్నై: బీజేపీ అధిష్ఠానం ఆదేశాలను శిరసావహించి రెండు రాష్ట్రాల గవర్నర్‌ పదవిని వదలుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Former Governor Dr. Tamilisai Soundararajan)కు జాతీయ స్థాయి పదవి వరించనుంది. ప్రస్తుతం కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మునుపటిలా స్వీయ మెజార్టీతో కాకుండా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చినందుకు గల కారణాలపై బీజేపీ(BJP) అధిష్ఠానం సమీక్షిస్తోంది. ముఖ్యంగా తమిళనాట పార్టీ ఘోర పరాజయానికి గల కారణాలపై కూడా చర్చలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తక్కువ సీట్లలో గెలిచిన రాష్ట్రాలు, ఘోర పరాజయాన్ని చవిచూసిన రాష్ట్రాలకు సంబంధించి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జులను మార్చేందుకు వ్యూహరచనలు కొనసాగుతున్నాయి.

ఇదికూడా చదవండి: CM Stalin: పోలీసుశాఖకు సీఎం వరాల జల్లు..


ఈ పరిస్థితులలో రెండు రోజులకు ముందు తమిళిసై ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలవడం కలకలం సృష్టించింది. తమిళిసైకి జాతీయ స్థాయి పదవినిచ్చే విషయంగా అమిత్‌షా ఆమెతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో ముమ్మరంగా పాల్గొంటున్న తమిళిసై జాతీయ స్థాయి పార్టీ పదవి కోసం పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే అధిష్ఠానం తమిళిసైకి పార్టీ పరంగా జాతీయ స్థాయి పదవిని కట్టబెడుతుందా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నామినేటెడ్‌ పోస్టు ఏదైనా అప్పగిస్తుందా? అనే విషయం ప్రస్తుతం సస్పెన్స్‌ కొనసాగుతోంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 11:53 AM