Share News

Kargil Vijay Diwas: నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం.. ప్రధాని మోదీ ద్రాస్‌లో పర్యటన

ABN , Publish Date - Jul 26 , 2024 | 07:05 AM

నేడు (జులై 26) కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లడఖ్‌(Ladakh)లోని కార్గిల్‌లో పర్యటించనున్నారు. ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

Kargil Vijay Diwas: నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం.. ప్రధాని మోదీ ద్రాస్‌లో పర్యటన
Kargil Vijay Diwas modi

నేడు (జులై 26) కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లడఖ్‌(Ladakh)లోని కార్గిల్‌లో పర్యటించనున్నారు. ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ 1999 యుద్ధ వీరులకు నివాళులర్పిస్తారు. వారి కుటుంబ సభ్యులను కూడా కలవనున్నారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం సందర్భంగా జులై 24 నుంచి 26 వరకు ద్రాస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ 2022లో కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.


ప్రపంచంలోనే ఎత్తైన

కార్గిల్ యుద్ధంలో(kargil war) అమరవీరుల జ్ఞాపకార్థం ఉదయం 9:20 గంటలకు ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని పీఎంఓ కార్యాలయం తెలిపింది. అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. ఆ తర్వాత 'షహీద్ మార్గ్' (వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ 'వీర్ నారీస్' (యుద్ధంలో అమరులైన సైనికుల భార్యలు)తో కూడా సంభాషించనున్నారు. వీర్ భూమిని కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. ఈ సొరంగం లేహ్‌కు అన్ని రకాల కనెక్టివిటీలను అందిస్తుంది. పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం కావడం విశేషం.


ఇప్పటికే

కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గురువారం కార్గిల్ చేరుకున్నారు. ఆయనతో పాటు కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన జనరల్ వీపీ మాలిక్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. జనరల్ మాలిక్ ద్రాస్‌లోని లామోచెన్ వ్యూ పాయింట్‌లో 1999 యుద్ధ అనుభవజ్ఞులను, వారి కుటుంబాలను కూడా కలిశారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ చినార్ కార్ప్స్, ఎల్‌ఓసీ వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించారు.


కార్గిల్ విజయ్ డే ఎందుకు

మే 5, 1999న పాకిస్తాన్ చొరబాటు తర్వాత, మే నుంచి జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారతదేశం(bharat), పాకిస్తాన్(pakistan) మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు యుద్ధం జరుగగా, జులై 26, 1999న భారతదేశం విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జులై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నాం.


ఇవి కూడా చదవండి:

Amritpal Singh: దేశంలో ప్రతి రోజు అప్రకటిత ఎమర్జెన్సీ.. ఎంపీని నిర్బంధిస్తారా..?


Google Maps: ఫ్లై ఓవర్‌ ఎక్కండి!


Read More National News and Latest Telugu News

Updated Date - Jul 26 , 2024 | 07:11 AM