Share News

TRAI: వ్యక్తిగత సమాచారం కోరుతూ వచ్చే.. మోసపూరిత కాల్స్‌ వలలో పడవద్దు

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:43 AM

మోసపూరిత కాల్స్‌ వలలో పడవద్దని టెలికాం సంస్థల రెగ్యులేటర్‌(ట్రాయ్‌) వినియోగదారులను హెచ్చరించింది.

TRAI: వ్యక్తిగత సమాచారం కోరుతూ వచ్చే.. మోసపూరిత కాల్స్‌ వలలో పడవద్దు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: మోసపూరిత కాల్స్‌ వలలో పడవద్దని టెలికాం సంస్థల రెగ్యులేటర్‌(ట్రాయ్‌) వినియోగదారులను హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోతే మొబైల్‌ నంబరు డిస్‌కనెక్ట్‌ అవుతుందని బెదిరిస్తూ ట్రాయ్‌ పేరుతో వచ్చే ఇటువంటి కాల్స్‌కి మోసపోవద్దని కోరింది. మొబైల్‌ నంబరు డిస్‌కనెక్ట్‌ చేస్తామని మెసేజ్‌లుగాని, ఇతర విధానాల్లోగాని లేదా మూడో పార్టీ ఏజెన్సీ ద్వారాగాని తాము సమాచారం పంపమని ట్రాయ్‌ స్పష్టం చేసింది.


ఇలా మొబైల్‌ నంబరు డిస్‌కనెక్ట్‌ అవుతుందని ట్రాయ్‌ పేరిట వచ్చే ఎటువంటి సందేశమైనా లేదా కాల్‌ అయినా కచ్చితంగా మోసం చేయడానికి చేసే ప్రయత్నమేనని, వాటికి స్పందించవద్దని కోరింది. ట్రాయ్‌ పేరిట వ్యక్తిగత సమాచారం కోరుతూ తమకు ముందుగా రికార్డు చేసిన కాల్స్‌ వస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేసినట్లు టెలికాం సంస్థల రెగ్యులేటర్‌ వెల్లడించింది.

Updated Date - Aug 22 , 2024 | 05:43 AM