Share News

Troy : ట్రూ కాలర్‌ లేకున్నా.. కాలర్‌ పేరు

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:31 AM

ట్రూ కాలర్‌ను ఉపయోగించకుండానే మనకు ఫోన్‌ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఫోన్లో అవతలివాళ్ల ఫోన్‌ నంబర్‌ సేవ్‌ చేసి లేకపోయినా,

 Troy : ట్రూ కాలర్‌ లేకున్నా.. కాలర్‌ పేరు

  • ఈ నెల 15 నుంచి ట్రాయ్‌ కొత్త సదుపాయం

న్యూఢిల్లీ, జూలై 5: ట్రూ కాలర్‌ను ఉపయోగించకుండానే మనకు ఫోన్‌ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఫోన్లో అవతలివాళ్ల ఫోన్‌ నంబర్‌ సేవ్‌ చేసి లేకపోయినా, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా.. వారి పేర్లు మన మొబైల్‌ స్ర్కీన్‌పై కనిపించేలా ‘పేరు వెల్లడి సేవ’ (నేమ్‌ ప్రజెంటేషన్‌ సర్వీ్‌స)ను ప్రవేశపెట్టనుంది.

ఈ నెల 15వ తేదీన ఈ సేవలను యాక్టివేట్‌ చేయనుంది. సిమ్‌ కార్డు కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాలర్ల పేర్లు కనిపిస్తాయని సమాచారం. ఫోన్‌ ఎవరు చేస్తున్నారో గుర్తించడానికి ప్రస్తుతం చాలా మంది ‘ట్రూ కాలర్‌’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, దీని వల్ల సమాచార భద్రతపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలోనే ట్రాయ్‌ ఈ సదుపాయాన్ని తీసుకువస్తోంది.

Updated Date - Jul 06 , 2024 | 04:31 AM