Share News

Tungabhadra: తుంగభద్రకు పెరిగిన వరద..10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:58 PM

తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) వరద పెరుగుతోంది. పై ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న తుంగ, భద్ర నదులు(Tunga and Bhadra rivers) ఉప్పొంగి తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి పెరుగుతోంది.

Tungabhadra: తుంగభద్రకు పెరిగిన వరద..10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

- 98.961 టీఎంసీలకు చేరిన నిల్వలు

- 87,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కంప్లి(బెంగళూరు): తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) వరద పెరుగుతోంది. పై ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న తుంగ, భద్ర నదులు(Tunga and Bhadra rivers) ఉప్పొంగి తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 10 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి 18,686 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. వరద తీవ్రతను బట్టి నదికి క్రమక్రమంగా నీటి విడుదలను పెంచుతామని బోర్డు అధికారులు తెలిపారు. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1627.21 అడుగుల వద్ద 98.961 టీఎంసీలు డ్యాంలో నీటిని నిల్వలు చేశారు.

ఇదికూడా చదవండి: తగ్గిన బంగారం ధర.. దుకాణాలకు పోటెత్తిన జనం


87,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే హంపి, కంప్లి(Hampi, Kampli) భాగాల్లో పూర్తి స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. నీటి ఉధృతి పెరగడంతో మత్స్యకారులు కూడా నది ఒడ్డునే వుండిపోయారు. ఇప్పటికే కంప్లి కోటే, సన్నాపురం, బెళుగోడుహాళ్‌, ఇటిగి సన్నాపురం(Kampli Kote, Sannapuram, Belugoduhal, Itigi Sannapuram) గ్రామాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు చేపట్టారు. నది ఒడ్డున వుండే గ్రామప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం వుందని అధికారులు తెలిపారు.

pandu1.2.jpg


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2024 | 01:58 PM