Delhi : బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ ముసాయిదా బిల్లు వెనక్కి
ABN , Publish Date - Aug 13 , 2024 | 04:31 AM
వివాదాస్పద బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (రెగ్యులేషన్) ముసాయిదా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: వివాదాస్పద బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (రెగ్యులేషన్) ముసాయిదా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం ప్రకటించింది. ముసాయిదా బిల్లు రివైజ్డ్ వెర్షన్‌ను కొందరికే రహస్యంగా ఇచ్చారంటూ విపక్షాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రతిస్పందనల మేరకు ముసాయిదా బిల్లుపై అక్టోబరు 15వ తేదీ వరకు మరిన్ని సూచనలు, సలహాలు తీసుకుంటామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ ఏడాది నవంబరు 11న మళ్లీ ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది.