Share News

Raja Sabha by-polls: రాజ్యసభకు కేంద్ర మంత్రులు బిట్టు, కురియన్ ఏకగ్రీవ ఎన్నిక

ABN , Publish Date - Aug 27 , 2024 | 06:06 PM

రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ మధ్యప్రదేశ్‌ నుంచి మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Raja Sabha by-polls: రాజ్యసభకు కేంద్ర మంత్రులు బిట్టు, కురియన్ ఏకగ్రీవ ఎన్నిక

న్యూఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ (Ravnee singh Bittu) రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ (George Kurian) మధ్యప్రదేశ్‌ నుంచి మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గుణ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గెలవడంతో మధ్యప్రదేశ్ రాజ్యసభ సీటు ఖాళీ అయింది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో రాజస్థాన్ నుంచి రాజ్యసభ సీటు ఖాళీ అయింది.


బిట్టూ ఎన్నిక ఇలా జరిగింది..

రాజస్థాన్ నుంచి రాజ్యసకు జరిగిన ఉప ఎన్నికలో తొలుత ముగ్గురు నామినేషన్ వేశారు. వారిలో బీజేపీ డమ్మీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఆగస్టు 27న నామినేషన్ల ఉపంసహరణ గడువు ముగియాల్సి ఉండగా, ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర్య అభ్యర్థి బబిత వాద్వాని నామినేషన్‌ను స్క్రూటినీలో తోసిపుచ్చారు. బీజేపీ డమ్మీ అభ్యర్థిగా ఉన్న సునీల్ కొఠారి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో రవనీత్ సింగ్ భిట్టూ ఎన్నిక ఏకగ్రీవమైంది. బిట్టూ ప్రస్తుతం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీ సహాయ మంత్రిగా ఉన్నారు.

Kolkata murder and rape: 12 గంటల బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపు


జార్జి కురియన్ ఎన్నిక..

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఉప ఎన్నికలో కురియన్‌తో పాటు మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. వీరిలో బీజేపీ డమ్మీ అభ్యర్థిగా ఉపాధ్యక్షుడు కాంత్‌దేవ్ సింగ్ కూడా ఉన్నారు. మూడో అభ్యర్థి నామినేషన్‌ను స్క్రూటినీలో రిటర్నింగ్ అధికారులు తోసిపుచ్చగా, సింగ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కురియన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కేరళకు చెందిన జార్జి కురియన్ ప్రస్తుతం కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 06:06 PM