Supreme Court: సుప్రీంకోర్టు ప్రస్తావించిన అరుణా షాన్ బాగ్ ఎవరు.. గొలుసులతో కట్టేసి, పాశవికంగా..!
ABN , Publish Date - Aug 20 , 2024 | 07:04 PM
కోల్ కతా వైద్యురాలి మృతి కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటోన్న వేధింపులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థలో లైంగిక హింస మూలాలు ఉన్నాయని పేర్కొంది. ఇందుకు అరుణా షాన్‌బాగ్ కేసు ఉదహరణ అని పేర్కొంది.
ఢిల్లీ: కోల్ కతా వైద్యురాలి మృతి కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటోన్న వేధింపులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థలో లైంగిక హింస మూలాలు ఉన్నాయని పేర్కొంది. ఇందుకు అరుణా షాన్‌బాగ్ కేసు ఉదాహరణ అని పేర్కొంది.
అరుణా షాన్ బాగ్ ఎవరు..?
సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన అరుణ్ షాన్ బాగ్ కూడా వైద్య సేవల్లో పనిచేశారు. 1967లో మహారాష్ట్ర కింగ్ ఎడ్వర్డ్ ఆస్పత్రిలో పనిచేశారు. డాక్టర్ సందీప్ సర్దేశాయ్ వద్ద విధులు నిర్వహించారు ఆమె కెరీర్ చక్కగా సాగుతున్న వేళ.. మరో ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నది. అయితే ఆ కలలన్నీ కల్లలయ్యాయి సోహన్ లాల్ అనే వార్డు బాయ్ లైంగిక దాడికి తెగబడ్డాడు. 1973 నవంబర్ 27వ తేదీన దారుణ ఘటన జరిగింది. గొలుసులతో కట్టేసి, అత్యంత పాశవికంగా లైంగికదాడి చేశాడు. దాంతో అరుణా షాన్ బాగ్ మెదడుకు తీవ్రంగా గాయమైంది. తర్వాత ఆమె కోమాలోకి వెళ్లి అచేతనంగా ఉండిపోయింది.
పనిచేయని మెదడు!
అరుణా షాన్ బాగ్ మెదడు ఎడమ భాగం పనిచేయలేదు. దాంతో మాట్లాడటం వీలు పడలేదు. కేఈఎం ఆస్పత్రిలో అరుణ కోసం ప్రత్యేక వార్డు కేటాయించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరుణను ఆ విధంగా చూసి మెర్సి కిల్లింగ్ (కారుణ్య మరణం)కు అనుమతి ఇవ్వాలని 2011లో జర్నలిస్ట్ ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దాదాపు నలభై ఏళ్లు అరుణ మంచానికే పరిమితమైంది. 2015లో న్యూమోనియా సోకి కన్నుమూసింది.
కోల్ కతాలో కూడా అలానే..
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో సంజయ్ అనే వ్యక్తి వైద్యురాలిపై లైంగికదాడికి తెగబడ్డాడు. అతనితోపాటు మరికొందరు ఉన్నారని మృతురాలి పేరంట్స్ ఆరోపిస్తున్నారు. వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ కేసును సుమోటోగా స్వీకరించి, మంగళవారం నాడు విచారించింది. ఆ క్రమంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అరుణా షాన్ బాగ్ కేసును ఉదహరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News