NPP: హింసాత్మక పరిస్థితుల వేళ ప్రభుత్వానికి షాక్.. ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ
ABN , Publish Date - Nov 18 , 2024 | 08:55 AM
హింసాత్మక మణిపూర్‌లో తాజా పరిస్థితుల దృష్ట్యా నేషనల్ పీపుల్స్ పార్టీ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందా. సీఎం మారనున్నారా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ప్రస్తుతం మణిపూర్(manipur)లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఈ రాష్ట్రంలో ఏడాదికిపైగా హింసతో ప్రభావితమైనప్పటికీ.. తాజా పరిస్థితులు మాత్రం బీరెన్ ప్రభుత్వంలో మరోసారి టెన్షన్‌ను పెంచాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) బీరెన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. NPP మద్దతు ఉపసంహరణ కారణంగా ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన సీఎం కుర్చీని కోల్పోతారా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం. అసలు అసెంబ్లీలో ఎంత మెజారిటీ ఉందనేది ఇక్కడ చుద్దాం.
NPP మద్దతు ఉపసంహరణ
మణిపూర్‌లో తాజా పరిస్థితుల దృష్ట్యా నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితిని సాధారణీకరించడంలో బీరెన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని NPP పేర్కొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్పీపీ గత కొద్ది రోజులుగా మణిపూర్‌లో పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొంది. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అసెంబ్లీలో అంకెల గేమ్
60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. NPP మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల బీరెన్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే మొత్తం NDA ఎమ్మెల్యేల సంఖ్య 53. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 37 కాగా, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు ఐదుగురు, జేడీయూ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్‌కు ఐదుగురు, కేపీఏకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు కుకీ పీపుల్స్ పార్టీ (KPA) కుల హింసను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర NDA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
మణిపూర్‌లో హింస ఎందుకు చెలరేగింది?
హింసాత్మకమైన మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా శనివారం రాత్రి హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను హతమార్చారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రజలు నవంబర్ 16న మణిపూర్‌లోని ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారు. వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను కాల్చివేశారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిరవధికంగా కర్ఫ్యూ విధించారు.
అమిత్ షా సమీక్షా సమావేశం
మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రంలో శాంతిభద్రతలకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. హోం మంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలో తన ర్యాలీలన్నింటినీ రద్దు చేసి, నాగ్‌పూర్ నుంచి అకస్మాత్తుగా ఢిల్లీకి వచ్చా్రు. ఢిల్లీకి వచ్చిన తర్వాత మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని అధికారులతో షా పరిశీలించి, దానికి సంబంధించి సమావేశం నిర్వహించారు.
జాతి వివాదంతో
మణిపూర్ ఒక సంవత్సరానికి పైగా జాతి వివాదంతో పోరాడుతోంది. మణిపూర్‌లోని మెజారిటీ మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే డిమాండ్‌కు నిరసనగా మణిపూర్‌లోని హిల్ జిల్లాల్లో గిరిజన ఐక్యత మార్చ్‌ను చేపట్టిన తర్వాత గత ఏడాది మే 3న కుల హింస చెలరేగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండలో కుకీ, మెయిటీ కమ్యూనిటీలకు చెందిన 220 మందికి పైగా ప్రజలు, భద్రతా సిబ్బంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇవి కూడా చదవండి:
Narendra Modi: నేటి నుంచి 19వ G20 సదస్సు.. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ
GRAP 4th Phase: నేటి నుంచి 12వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసెస్.. యాక్షన్ ప్లాన్ 4 అమలు..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Jiostar: మొదలైన జియోస్టార్.. రూ. 15కే డబుల్ డోస్ ఎంటర్ టైన్మెంట్
Read More National News and Latest Telugu News