AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు

ABN, Publish Date - Dec 09 , 2024 | 06:27 AM

ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగానే హుస్సేన్ సాగర్‌పై అద్భుతంగా వైమానిక విన్యాసాలు అదరగొట్టాయి. ఒకేసారి ఆకాశంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ సందడి చేశాయి. సూర్య కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలు చేశాయి.

AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు 1/7

ఎయిర్‌ షో‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు 2/7

అరగంటకు పైగా సాగిన ఎయిర్‌ షోలో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ గ్రూప్‌ కెప్టెన్‌ అజయ్‌ దాశరథి బృందానికి చెందిన తొమ్మిది హాక్‌ ఎంకే 132 విమానాలు చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి.

AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు 3/7

ఆదివారం కావడంతో వీక్షించేందుకు వచ్చిన జనంతో హుస్సేన్‌సాగర్‌, నెక్ల్‌సరోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎయిర్‌షో భాగంగా విమానాలు త్రివర్ణ పతాకంలోని రంగులను విరజిమ్మాయి

AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు 4/7

ఒక్కసారిగా నింగి మూడు రంగుల జెండా రూపును సంతకరించుకోవడంతో వీక్షకుల మనసు దేశభక్తితో ఉప్పొంగి భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు

AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు 5/7

విన్యాసాల్లో భాగంగా రెండు విమానాలు ప్రేమ చిహాన్ని (లవ్‌ సింబల్‌) వేయగా మరో విమానం బాణం గుర్తుతో మధ్యలోంచి దూసుకెళ్లడంతో వీక్షకులు ఈలలు వేశారు.

AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు 6/7

ఎయిర్‌షో నిర్వహించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బృందానికి రేవంత్‌ అభినందనలు తెలిపారు.

AIR Show: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు 7/7

హుస్సేన్‌సాగర తీరాన నిర్వహించిన ‘ఎయిర్‌ షో’ను చూసి జనం కాసేపు తమను తామే మరిచిపోయారు.

Updated at - Dec 09 , 2024 | 06:35 AM